Butter Chicken: ప్రాణం తీసిన బటర్ చికెన్.. ఏం జరిగిందంటే.? వీడియో వైరల్.
రెస్టారెంట్ ఫుడ్ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అలా ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి వెళ్లి తనకెంతో ఇష్టమైన బటర్ చికెన్ తిన్నారు . అది టేస్ట్ చేసిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలో బురీ ప్రాంతానికి చెందిన జోసెఫ్ హిగ్గిన్సన్ అనే వ్యక్తి నట్స్, ఆల్మండ్స్ ఎలర్జీతో బాధపడుతున్నాడు. దీనినే అనఫిలాక్సిక్‌గా పిలుస్తారు.
రెస్టారెంట్ ఫుడ్ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అలా ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి వెళ్లి తనకెంతో ఇష్టమైన బటర్ చికెన్ తిన్నారు . అది టేస్ట్ చేసిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలో బురీ ప్రాంతానికి చెందిన జోసెఫ్ హిగ్గిన్సన్ అనే వ్యక్తి నట్స్, ఆల్మండ్స్ ఎలర్జీతో బాధపడుతున్నాడు. దీనినే అనఫిలాక్సిక్‌గా పిలుస్తారు. అయితే 27 ఏళ్ల హిగ్గన్సన్ రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్ బటర్ ఆర్డర్‌చేసాడు. అది కొంచెం తినగానే అతను కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. బటర్ చికెన్ లేబుల్ పైన ఇందులో ఆల్మండ్స్ ఉన్నాయని అలర్జీ సమాచారం కూడా పొందుపరిచారు. అయితే జోసెఫ్ గతంలో నట్‌లు ఉన్న డిష్‌లను తీసుకున్నా ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదని డిజిటల్ న్యూస్ పోర్టల్ మిర్రర్ పేర్కొంది. అయితే బాదం పప్పులతో కూడిన బటర్ చికెన్ కర్రీని కొద్దిగా తీసుకున్న వెంటనే హిగ్గిన్సన్ అలర్జీ రియాక్షన్‌తో ప్రాణాలు కోల్పోయాడు. హిగ్గిన్సన్ అనఫిలాక్సిస్‌తో కన్నుమూశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయనకు తన అలర్జీల గురించి తెలుసని, ఏదైనా డిష్ తీసుకునే ముందు విధిగా అలర్జీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటాడని హిగ్గిన్సన్ కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.