విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్

Updated on: Oct 10, 2025 | 3:50 PM

భార్యతో విడాకులు తీసుకున్నందుకు ఓ వ్యక్తి సంతోషంగా వేడుక చేసుకున్నాడు. తల్లి చేతుల మీదుగా పాలతో స్నానం చేసి.. సంప్రదాయ దుస్తులు వేసుకుని మరీ అందంగా ముస్తాబయ్యాడు. అంతటితో ఆగకుండా.. 'హ్యాపీ డివోర్స్' అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశాడు. తనకేమీ బాధ లేదని.. ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బిరాదర్ డీకే అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తాను విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉందని వివరిస్తూనే.. ముందుగా తన తల్లి చేతుల మీదుగా పాలతో స్నానం చేశాడు. ఆపై సంతోషంగా నవ్వుతూ వెళ్లి సంప్రదాయ బట్టలు ధరించాడు. పెళ్లికి ముస్తాబు అయినట్లుగా కుర్తా, షూ వేసుకుని అందంగా ముస్తాబయ్యాడు. ఆపై ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నందుకు.. ఇప్పుడు చాలా ఫ్రీగా, సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ముఖ్యంగా బంగారం ధరలు తులానికి లక్షా 30 వేలకు చేరిన ఈ సమయంలో కూడా భార్యకు భరణంగా 12 తులాల బంగారం, 18 లక్షల రూపాయల నగదు ఇచ్చినా ఏమాత్ర బాధగా లేదని.. ఇప్పుడే తన జీవితం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విడాకులను సెలబ్రేట్ చేసుకోవడం భారత సంప్రదాయంలో కాస్త కొత్తగా ఉండేసరికి అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీ నిర్ణయానికి తల్లి మద్దతు లభించడం విశేషం బ్రో అని కొందరు మరో పెళ్లి చేసుకోవద్దు.. ఇలాగే స్వేచ్ఛగా గడిపేయ్‌ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ముఖ్యంగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. కింద ఓ క్యాప్షన్ రాశాడు. అది మరింత చర్చనీయాంశంగా మారింది. “దయచేసి సంతోషంగా ఉండండి, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండేలా చూసుకోండి. నిరాశ చెందకండి” అని సందేశం ఇచ్చాడు. విడాకుల సెటిల్‌మెంట్‌కు సంబంధించి సంచలన ప్రకటన చేశాడు. “తను 120 గ్రాముల బంగారం, రూ. 18 లక్షల నగదును పెళ్లి సమయంలో తీసుకోలేదని.. కానీ ఇప్పుడు ఇచ్చాననీ తనిప్పుడు ఒంటరిని అని అన్నాడు. సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది తన జీవితం. ఇవి తన నియమాలు. తాను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉంటాను అని రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు

ఫస్ట్ టైం లాటరీ టికెట్ కొని.. పాతిక కోట్లు గెలిచిన పెయింటర్

రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. రైలు టికెట్లు రద్దు చేయాల్సిన పనిలేదు