అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదో తరగతి బాలుడు తన వాటర్ బాటిల్‌లో మూత్రం పోసి క్లాసులోని బాలికలకు తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలికలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించి, బాలుడి తల్లిదండ్రులను విచారించడంతో పాటు ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్‌లో అత్యంత హేయమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడు తన వాటర్ బాటిల్‌లో మూత్రం పోసి, తన క్లాసులోని బాలికలకు తాగించాడు. ఈ ఘటన గుణా జిల్లాలోని అరోన్ డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అక్కడ ఐదవ తరగతి చదువుతున్న ఒక బాలుడు తన వాటర్ బాటిల్‌లో మూత్రం నింపి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ నీచమైన చర్య గురించి బాధిత బాలికలు వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ స్పందించిన తీరు మరింత విస్మయానికి గురిచేసింది. బాధిత బాలికల ఫిర్యాదుపై ప్రిన్సిపాల్ అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. నోరు రుచిగా లేకపోతే పది రూపాయల చాక్లెట్ తినమంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాఠశాల వద్దకు భారీగా చేరుకున్నారు. స్కూల్ గేటుకు తాళం వేసి ప్రిన్సిపాల్‌కు, తప్పు చేసిన బాలుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. తహసీల్దార్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను వెంటనే ఘటనా స్థలానికి పంపించారు. గుణా జిల్లా మేజిస్ట్రేట్ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ అమానుష చర్యకు పాల్పడిన బాలుడిని, అతని తల్లిదండ్రులను విచారణకు పిలిపించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని బీఈఓను ఆదేశించామని, నిందితులు ఎవరైనాసరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Irumudi Review: రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ
Omkuchi Narasimhan: ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?
