చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??
అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నాడో వ్యక్తి. అంతేకాదు.. గటగటా మంచినీళ్లు కూడా తాగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నాడో వ్యక్తి. అంతేకాదు.. గటగటా మంచినీళ్లు కూడా తాగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన సంతోష్ అనే 52 ఏళ్ల వ్యక్తికి గత ఏప్రిల్ 19 మంగళవారం సాయంకాలం సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన వైద్యులు.. ఏప్రిల్ 20 ఉదయం పేషెంట్ చనిపోయినట్లు నిర్థారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లి.. అంత్యక్రియుల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే స్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో.. చనిపోయాడని నిర్ధారించిన వ్యక్తి పాడెపై నుంచి ఒక్కసారిగా లేచాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: మెగాస్టార్ పాటకు డాన్స్ అదరగొట్టిన వృద్ధుడు !!