తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

Updated on: Jun 18, 2025 | 5:21 PM

ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవారిని ఎన్నటికీ మర్చిపోకూడదు. కానీ ప్రస్తుత కాలంలో మనుషుల్లో కృతజ్ఞతా భావం పూర్తిగా నశించిపోతుందా అనిపిస్తోంది. అందుకే అప్పుడప్పుడూ పశుపక్ష్యాదులు తమ చేష్టలతో మానవులకు తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ కొండముచ్చు తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే మూగగా రోదిస్తూ అతని అంతిమయాత్రలో పాల్గొని అతని చితిపై కూర్చుని ముద్దుపెట్టి చివరి వీడ్కోలు పలికింది.

ఈ ఘటన చూపరులను కదిలించింది. ఆ మూగజీవి ప్రేమకు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈయన జార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లా బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నాసింగ్‌కు మూగజీవులంటే ప్రాణం. అతను కోతులు, కొండముచ్చులు, ఇతర జంతువులకు రొట్టెలు, అన్నం, ఇతర ఆహారం పెట్టేవాడు. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. మూగ జీవాలపై ఎవరైనా దాడికి యత్నిస్తే మున్నాసింగ్ అడ్డుకునేవారు. అలా చేయొద్దని వారించే వారు. మున్నా సింగ్‌ హనుమంతుడి భక్తుడని గ్రామస్తులు చెప్పారు. ఏమైందో ఏమో జూన్‌ 10 మంగళవారం మున్నాసింగ్‌ చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని బంధువులు, స్థానికుల సందర్శనార్ధం అతని ఇంటి బయట ఉంచారు. అందరూ వచ్చి మున్నాసింగ్‌ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కొండముచ్చుకూడా అక్కడికి వచ్చింది. దానికి విషయం ఎలా తెలిసిందో కానీ, తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి నిర్జీవంగా పడిఉండటం చూసి మూగగా రోదించింది. అతని మృతదేహంపై కప్పిన వస్త్రాన్ని తొలగించి అతన్ని ముఖాన్ని తదేకంగా చూస్తూ నుదుటిపై ముద్దుపెట్టింది. అక్కడే గంటలు తరబడి కూర్చుంది. ఆ తర్వాత అతని అంతిమయాత్రలోనూ పాల్గొంది. అంతిమయాత్ర మార్గంలో అందరితో పాటు కలిసి నడిచి వెళ్లింది. అంతిమ సంస్కారాలు చేసే సమయంలో కొండముచ్చు మున్నాసింగ్‌ చితిపై చాలాసేపు కూర్చుండిపోయింది. అది చూసిన గ్రామస్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మనుషులపై జంతువులు చూపే ప్రేమ చాలా లోతైనదంటూ చర్చించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందేసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. వధువు ఏం చేసిందంటే ?