Lovers suicide: విడిచి ఉండలేక.. కలిసి బతకలేక.. సూసైడ్ చేసుకున్న ప్రేమికులు.

|

Mar 15, 2024 | 9:57 PM

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదృష్టవశాత్తు ఇద్దరి సామాజిక వర్గాలు ఒకటే కావడంతో పెద్దలు తప్పక ఒప్పుకుంటారని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. సహజంగానే ఇరు కుటుంబాలవారు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు. దాంతో ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక, కలిసి బతికే ధైర్యం లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదృష్టవశాత్తు ఇద్దరి సామాజిక వర్గాలు ఒకటే కావడంతో పెద్దలు తప్పక ఒప్పుకుంటారని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. సహజంగానే ఇరు కుటుంబాలవారు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు. దాంతో ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక, కలిసి బతికే ధైర్యం లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిత్తపూర్‌ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్‌, మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీతల మధ్య పాఠశాల స్థాయిలోనే ప్రేమ చిగురించింది. ఆమె రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్‌ డీసీఎం వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. బుధవారం ఉదయం తన అక్క కొడుకు చిన్నారి వియాన్ష్‌కు భోజనం తినిపించే విషయమై సంగీత చిరాకు పడింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అనంతరం కూలీ పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎవరితోనో ఫోన్‌ మాట్లాడిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి చూసిన బంధువులు అచేతన స్థితిలో ఉన్న సంగీతను చూసి కిందికి దించారు. వెంటనే మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వూద్యులు తెలిపారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. భగవాన్‌ డీసీఎం వ్యాన్‌లో పత్తిలోడును కుమురంభీం జిల్లా రేపల్లివాడ జిన్నింగ్‌ మిల్లుకు తీసుకెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యాడు. బెల్లంపల్లికి చేరుకోగానే సంగీత మృతి చెందిన విషయం తెలిసింది. వెంటనే పురుగుమందు కొనుగోలు చేసి బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సోదరుడు భరత్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దారి వెంట వెతుకుతూ వెళ్లగా రహదారిపై వ్యాన్‌ కనిపించింది. పక్కనే ఉన్న మామిడితోటలో అపస్మారక స్థితిలో భగవాన్‌ కనిపించారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భగవాన్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాళ్లగురిజాల ఎస్సై నరేష్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..