దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
తమిళనాడులో పారిశుద్ధ్య కార్మికుల నిజాయితీ ప్రజల మన్ననలు పొందుతోంది. దురై అనే కార్మికుడు 20 తులాల బంగారం, కిలో వెండి ఉన్న బ్యాగ్‌ను తిరిగి ఇచ్చి, తన కొడుకు వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షల ఆర్థిక సహాయం పొందారు. అలాగే, పద్మ అనే మరో కార్మికురాలు 45 తులాల బంగారాన్ని తిరిగి ఇచ్చి రజినీకాంత్ నుండి ప్రశంసలు అందుకున్నారు. వారి నిజాయితీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.
రోడ్డు మీద బంగారు నగల బ్యాగ్ దొరకితే ఎవరైనా ఏం చేస్తారు? లక్ష్మీ దేవి కరుణించిందని పొంగిపోతూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే ఆ వ్యక్తి దొరికిన దాన్ని ‘బాధ్యత కలిగిన పౌరుడిగా’ తిరిగిచ్చేశాడు. తమిళనాడులోని తిరువారూర్‌లో రాధాకృష్ణన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి శుభకార్యక్రమానికి వెళ్లారు. తిరిగొస్తుండగా 20 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ అనుకోకుండా దారిలో పడిపోయింది. బ్యాగ్ పోగుట్టుకున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువారుర్ మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే దురైకి ఆ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్‌లో చూడగానే బంగారం, వెండి వస్తువులు కనిపించడంతో అతడు మొదట షాకయ్యాడు. ఆ తర్వాత, వెంటనే పోలీస్ స్టేషన్లో ఆ బ్యాగ్ ను అప్పగించాడు. పోలీసులు రాధాకృష్ణన్ కుటుంబాన్ని పిలిపించి నగలను వారికి ఇచ్చేశారు. దొరికిన నగల బ్యాగును నిజాయితీగా అప్పగించినందుకు దురైను పోలీసులు ప్రశంసించారు. అదే సమయంలో దురై తన కొడుకుకు వెన్నెముక చికిత్స కోసం రూ.4 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారని, ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకున్నాడు. తన 34 ఏళ్ల కుమారుడు గత మూడు సంవత్సరాలుగా మంచం మీదే ఉన్నాడని బాధపడ్డాడు. తిరువారూర్ కలెక్టరేట్లో తిరువారూరు ఎమ్మెల్యే కలైవానన్ రూ.4 లక్షల చెక్కును దురైకు అందజేశారు. చికిత్సకు ఇంకా ఏమైనా అవసరమైతే తనని సంప్రదించాలని అతడితో చెప్పారు. కొద్ది రోజుల క్రితం కూడా తమిళనాడులో ఇలాంటి సంఘటనే జరిగింది. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ చెత్తలో దొరికిన 45 తులాల బంగారు నగలను తిరిగి ఇచ్చింది. దీంతో ఆమె నిజాయితీని మెచ్చి నటుడు రజినీకాంత్ బంగారు గొలుసు, శాలువాతో సత్కరించారు. చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ చెత్తలో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. దీంతో పలువురు నుంచి ప్రశంసలు పొందారు. అయితే ఈ విషయం అంతటా వ్యాపించడంతో రజినీకాంత్ తన ఇంటికి వారి కుటుంబ సభ్యులందరిని పిలిచి మరీ సత్కరించారు. ఆమెతో మాట్లాడి గోల్డ్ చేన్ను బహుమతిగా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ
Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి
Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..
Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్
