ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

Updated on: Apr 02, 2025 | 1:58 PM

సాధారణంగా చికెన్‌ కబాబ్‌ ఎంత ధర ఉంటుంది? మహా అయితే ఎక్కువలో ఎక్కువ వెయ్యి రూపాయలు ఉంటుంది. కానీ, చైనాలో మాత్రం రూ.5,500 ధర పలుకుతుంది. షాంఘైలోని ఓ రెస్టారెంట్ సగం ఉడికిన చికెన్‌ను అధిక ధరకు విక్రయిస్తోంది. దీనికి ఆ రెస్టారెంట్‌ యాజమాన్యం విచిత్రమైన కారణం చెబుతోంది. ఆ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక వ్యాపారవేత్త సగం ఉడికిన చికెన్ కర్రీని కొని తిన్నాడు.

రసీదుపై ధర 480 యువాన్లు అని ఉంది. అంటే మన కరెన్సీలో రూ. 5,500 అన్నమాట. ఆ ధర చూసిన వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వ్యాపారస్తునికి చిర్రెత్తుకొచ్చి కోడి కబాబ్‌ను అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నావని ప్రశ్నించాడు. కోడిని నీళ్లకు బదులు పాలతో పెంచావా?అని రెస్టారెంట్ యజమానిని వ్యాపారవేత్త నిలదీశాడు. దాంతో ఆయన అవును అని సమాధానం ఇస్తూ, కోడి సాంప్రదాయ చైనీస్ సంగీతాన్ని వింటూ పెరిగిందని చెప్పాడు. నీటికి బదులుగా పాలు తాగించి పెంచామని చెప్పాడు. చికెన్ కూడా సన్‌ఫ్లవర్ చికెన్ జాతికి చెందినదని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’