Viral Video: ‘ఒక జీవికి ఆకలేస్తే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే’. ఇది ఇటీవల వచ్చిన పుష్ప (Pushpa) సినిమా పాటలోని చరణం. అడవిని గమనిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపించక మానదు. ఆకలి కోసం జరిగే పోరులో నిత్యం ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఒక జీవిపై మరో జీవి దాడి చేసుకోవడం సర్వసాధారణమైన విషయమనే తెలిసిందే. అది ఆకలే కావొచ్చు, ఆధిపాత్యం కావొచ్చు కానీ దాడులు, ప్రతి దాడులు మాత్రం సర్వసాధారణం. ఇక బలం ఉన్నవాడిదే రాజ్యమనే విషయం కూడా తెలిసిందే. అందుకే సింహం అడవికి రాజు అయ్యాడు. సింహానికి ఉన్న బలమే ఈ పేరు తెచ్చిపెట్టింది.
అయితే సింహం అడవికి రాజు అని పుస్తకాల్లో కథల్లో చదువుకుంటాం కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజమనిస్తోంది. సింహం దాడి చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఓ అటవీ ప్రాంతంలో కొందరు జంగిల్ సవారీకి వెళ్లారు. అదే సమయంలో నిర్వాహకులు, పర్యాటకులకు సింహాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ జీబ్రా అటుగా వచ్చింది. దీంతో వెంటనే జీబ్రాపై దాడి చేసింది. కసిగా పీకను నొక్కి చెట్ల పొదల్లోకి లాక్కెల్లి పోయింది.
దీనంతటినీ పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు రకకరాల కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ప్రకృతి ధర్మమే అయినప్పటికీ చాలా దారుణంగా ఉంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఆలోజింపచేస్తోంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Nurses Dance: ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు.. లేచి కూర్చున్న కోమాలోని పేషెంట్..!