అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

Updated on: Oct 11, 2026 | 9:11 AM

నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో అరుదైన ‘పాండవపత్తి’ మొక్క భక్తులను ఆకర్షిస్తోంది. ఈ మొక్క ఆకుకు నూనె రాసి వెలిగిస్తే వత్తిలా మంట వస్తుందని స్థానికులు చెబుతున్నారు. బోడిగ చెట్టుగా కూడా పిలిచే ఈ మొక్కను ఆలయ నిర్వాహకులు సంరక్షిస్తున్నారు. పాండవుల అరణ్యవాసంతో ఈ మొక్కకు సంబంధం ఉందనే స్థానిక కథనం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సాధారణంగా దేవుడికి దీపారాధన చేయాలంటే.. ఒత్తి ప్రధానమైనది. ఓ ప్రమిదలో నూనె లేదా నెయ్యి వేసి, పత్తితో చేసిన ఒత్తిని వేసి దీపం వెలిగిస్తారు. కానీ ఏ ఒత్తీ లేకుండా కేవలం ఒక ఆకుతోనే దీపం నిరంతరాయంగా వెలుగుతుందంటే నమ్మగలరా? నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గంగా గౌరీ సమేత మరకత లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ అరుదైన మొక్క ఉంది. ఈ మొక్క ఆకుతోనే దీపం వెలిగిస్తున్నారు. ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ అరుదైన మొక్కను స్థానికంగా ‘పాండవపత్తి’ అని పిలుస్తారు. మామూలుగా అయితే దీనిని తెలుగులో బోడిగ చెట్టు అంటారు. దీని శాస్త్రీయ నామం ‘కలికార్ప టోమెంటోసా’. పురాణ కథనాల ప్రకారం పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో రాత్రివేళల్లో వెలుతురు కోసం ఈ చెట్టు ఆకులకు నూనె రాసి కాగడాలుగా, దీపాలుగా ఉపయోగించేవారని, అందుకే దీనికి ఈ పేరు వచ్చిందని ఆలయ నిర్వాహకులు మస్తాన్ రావు తెలిపారు. ఈ ఆకు ప్రత్యేకత ఏమిటంటే.. ప్రమిదలో ఆకును ఉంచి కాస్త నూనె రాసి వెలిగిస్తే, దూది వత్తిలాగే ఎక్కువసేపు నిరంతరంగా వెలుగుతుంది. అంతేకాకుండా పొగ కూడా తక్కువగా రావడం ఈ ఆకుల విశేషం. ఆలయ ప్రాంగణంలో పెంచుతున్న ఈ ఆకులకు నూనె రాసి వెలిగించి పరీక్షించిన పలువురు భక్తులు, స్థానికులు ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. సంప్రదాయ రక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఈ ప్రకృతి విశేషాలను అందించేందుకు ఆలయ నిర్వాహకులు ఈ మొక్కలను సంరక్షిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!

షాకింగ్‌ న్యూస్‌.. రైస్‌ ధరలు పెరుగుతున్నాయ్‌!

హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

అంతరిక్షంలోకి విస్కీ.. 2028లో జరగబోయే ప్రయోగం ఇదే..!

Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ

Loading...
Unable to load recommendations.
Follow Us