టప టపా పేలిపోయిన సెల్‌ ఫోన్లు!

Updated on: Feb 22, 2026 | 5:44 PM

వేసవి ప్రారంభంలో వరుస అగ్నిప్రమాదాలో చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని మైత్రివనం ఆదిత్య ఎన్‌క్లేవ్‌ నీలగిరి బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన మరువకముందే శనివారం కేపీహెచ్‌బీ కాలనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పద్మావతి ప్లాజాలోని 'శ్రీ సాయి కమ్యూనికేషన్స్' మొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది.

మంటల ధాటికి షాపులోని కొత్త మొబైల్ ఫోన్లలోని లిథియం బ్యాటరీలు ఒక్కొక్కటిగా పేలడంతో ప్రమాద తీవ్రత రెట్టింపైంది. సుమారు 50కి పైగా కొత్త స్మార్ట్‌ఫోన్లు, వేల సంఖ్యలో యాక్సెసరీలు, ఛార్జర్లు నిమిషాల్లోనే కాలి బూడిదయ్యాయి. బ్యాటరీలు పేలుతున్న శబ్దంతో స్థానిక వ్యాపారులు, నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సుమారు రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Follow Us