మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

Updated on: Feb 24, 2026 | 7:43 PM

కేరళలోని కొచ్చి మెట్రో పిల్లర్‌పై వారం రోజులకు పైగా చిక్కుకున్న 'సుభాష్‌' అనే పిల్లిని అగ్నిమాపక బృందాలు విజయవంతంగా రక్షించాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వద్ద పిల్లిని గుర్తించిన స్థానికులు సమాచారం అందించగా, తీవ్ర ప్రయత్నాల తర్వాత హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సాయంతో రెస్క్యూ చేశారు. ప్రజల డిమాండ్లు, వైరల్ వీడియోల నేపథ్యంలో ఈ ఆపరేషన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. మెట్రో పిల్లర్‌పై పిల్లిని కాపాడటం ఇది మూడోసారి కావడం గమనార్హం.

కేరళలోని కొచ్చిన్‌లో వారం రోజులకు పైగా మెట్రో పిల్లరుపై చిక్కుకున్న పిల్లిని అగ్నిమాపక బృందాలు కాపాడాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషను వద్ద పైన బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న పిల్లిని గమనించిన ఆటోడ్రైవర్లు జంతు సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి అక్కడికి చేరుకున్న సిబ్బంది మెట్రో సర్వీసులు ముగిశాక విద్యుత్తులైను నిలిపివేసి రెస్క్యూ ఆపరేషను చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం అగ్నిమాపక బృందాలు హైడ్రాలిక్‌ లిఫ్టు సాయంతో శ్రమించి పిల్లిని సురక్షితంగా కిందకు దించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ సినిమాలో గుణ కేవ్స్‌లోకి జారిపడిపోయిన ‘సుభాష్‌’ పేరును ఆటో డ్రైవర్లు ఆ పిల్లికి పెట్టడంతో అది వైరల్‌గా మారింది. దీంతో సుభాష్‌ను ఎలాగైనా కాపాడాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అంతెత్తున్న పిల్లర్‌ నుంచి కిందకు రాలేక, ఆకలికి అక్కడే ఉండలేక అవస్థలు పడుతున్న పిల్లిని కాపాడాలని రంగంలోకి దిగిన అగ్నిపమాపిక సిబ్బంది చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది. వారిని చూసి భయంతో పిల్లి సందులో దాక్కుంది. దీంతో అక్కడి దాకా హైడ్రాలిక్‌ క్రేన్‌ వెళ్లలేకపోయింది. రెండో ప్రయత్నంలో కేఎంఆర్‌ఎల్‌ 15 నిమిషాలపాటు మెట్రో సేవలను నిలిపింది. అయితే ఆ సమయంలో పిల్లి ఎటుపోయిందో ఎవరికీ కనిపించలేదు. దీంతో మరోసారి ప్రయత్నం ఫలించలేదు. చివరికి ఆదివారం అర్ధరాత్రి పిల్లిని పట్టుకుని పిల్లర్‌ నుంచి కిందకు దింపారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ ను చూడ్డానికి గుమిగూడిన జనం ఆనందంతో కేరింతలు కొట్టారు. వారం రోజులుగా చిక్కుకున్న పిల్లి తిండిలేక నీరసంగా కన్పించింది. దాంతో అధికారులు పిల్లికి ఆహారం అందించారు. మెట్రో పిల్లర్‌పై పిల్లిని కాపాడటం ఇది మూడోసారి అని అగ్నిమాపక బృందం అధికారి తెలిపారు. మెట్రోస్టేషన్‌ నుంచి అది పొరపాటున పిల్లర్‌పై పడి ఉంటుందనీ మెట్రో రైల్‌ అధికారుల సహకారంతోనే విజయం సాధించామని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

Follow Us