Knife in Stomach: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి డాక్టర్‌ షాక్‌..!

|

Sep 23, 2023 | 8:08 PM

రకరకాల వ్యాధులతో వైద్యుల వద్దకు వెళ్తుంటారు బాధితులు. వైద్యులు వారికి రకరకాల పరీక్షలు చేసి చికిత్స చేస్తుంటారు. అలా డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన ఓ పేషంట్‌ ఎక్స్‌రే రిపోర్ట్‌ చూసి డాక్టర్‌ ఒక్కసారిగా షాకయ్యాడు. అతని కడుపులో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు కనిపించింది. అంత పదునైన ఆయుధం కడుపులో ఉన్నా లోపల ఉన్న అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడం డాక్టర్‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

రకరకాల వ్యాధులతో వైద్యుల వద్దకు వెళ్తుంటారు బాధితులు. వైద్యులు వారికి రకరకాల పరీక్షలు చేసి చికిత్స చేస్తుంటారు. అలా డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన ఓ పేషంట్‌ ఎక్స్‌రే రిపోర్ట్‌ చూసి డాక్టర్‌ ఒక్కసారిగా షాకయ్యాడు. అతని కడుపులో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు కనిపించింది. అంత పదునైన ఆయుధం కడుపులో ఉన్నా లోపల ఉన్న అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడం డాక్టర్‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు క్యూరియస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నేపాల్‌కు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అతడిలో వికారం, విరేచనాలు, వాంతులుకావడం లాంటి లక్షణాలేవి కనిపించలేదు. బీపీ కూడా సాధారణంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడి శరీరాన్ని పరిశీలించగా.. పొట్ట కుడిభాగంలో కుట్లు వేసి ఉన్న గాటు కనిపించింది. ఏం జరిగిందని వైద్యులు ప్రశ్నించగా.. అంతకుముందు రోజు గొడవ జరిగిందని, అప్పడే ఆ గాయమైందని తెలిపాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌-రే తీయించారు. పొట్టలో 15 సెంటీ మీటర్ల పొడవైన చాకు ఉన్నట్లు ఎక్స్‌రే రిపోర్ట్‌లో తేలింది. శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువును తొలగించారు. ఆ చాకు ఒక వైపు నుంచి మరొక వైపునకు తిరిగినప్పటికీ పొట్ట భాగంలోని అవయవాలు ఏవీ తీవ్రంగా దెబ్బతినలేదని వైద్యులు తెలిపారు. చాకు పొడిచినప్పుడు పెద్ద గాయమేమీ కాకపోవడం, పైగా మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో బాధితుడు గుర్తించలేకపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఘటన జరిగిన రోజు స్థానికంగా ఉండే ఓ ఆరోగ్య కార్యకర్త అతడి గాయానికి కుట్లు వేసినట్లు పేర్కొంది. తరువాతి రోజు పొట్ట భాగంలో అసౌకర్యంగా అనిపించడంతో అతడు వైద్యుల వద్దకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..