ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. నవ జంట దుర్మరణం

Updated on: Dec 10, 2025 | 12:05 PM

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ప్రీవెడ్డింగ్‌ జంట, షూట్ ముగించుకుని తిరిగి వస్తుండగా కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లారీ ఢీకొనడంతో కరియప్ప, కవిత అక్కడికక్కడే మరణించారు. డిసెంబరు 20న జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం, రెండు గ్రామాల్లో శోకం నెలకొంది.

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. వివాహానికి ముందు ప్రీవెడ్డింగ్‌ షూట్‌తో తమ కొత్త జీవితానికి బాటలు వేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో సంతోషంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ముగించుకొని తిరిగి ఇంటికి బయలు దేరారు. ఇంతలోనే విధి కన్నుకుట్టింది. ఆ నవ జంటను రోడ్డు ప్రమాద రూపంలో మింగేసింది. కర్ణాటకలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన కాబోయే భార్యాభర్తలు విగతజీవులయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డారు. దీంతో వివాహ ఏర్పాట్లతో సందడిగా ఉన్న ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నిండిపోయింది. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కొప్పల్ తాలూకాలోని హనుమాన హట్టి గ్రామానికి చెందిన కరియప్పకు, కరతగి తాలూకాలోని ముస్తూరు గ్రామానికి చెందిన కవితతో వివాహం నిశ్చయమైంది. డిసెంబరు 20న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన కరియప్ప, కవితలు బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరి ద్విచక్రవాహనానికి ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన మరో లారీ బైక్ ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన కవిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఆసుపత్రికి తరలిస్తుండగా కరియప్ప కూడా తుదిశ్వాస వదిలాడు. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్న వధూవరులు మృత్యువును పంచుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట మృత్యువాత పడటంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ఖండ-2 రిలీజ్ డేట్ ఫిక్స్? గెట్ రెడీ

Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం

దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది