Cotton Candy: రంగేసిన పీచు మిఠాయిపై నిషేధం

|

Mar 14, 2024 | 12:36 PM

కృత్రిమ ఫుడ్‌ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్‌-బి అనే రసాయన ఏజెంట్‌ ఆరోగ్యానికి హానికరమని తెలిపింది. తాజాగ కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు మాట్లాడుతూ, కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికారక రసాయనాలు ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోందనీ, నిపుణులు పరీక్షించిన 107 ఆహార పదార్థాల్లో రోడమైన్‌-బి, టాట్రజైన్‌ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారనీ ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని అన్నారు.

కృత్రిమ ఫుడ్‌ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్‌-బి అనే రసాయన ఏజెంట్‌ ఆరోగ్యానికి హానికరమని తెలిపింది. తాజాగ కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు మాట్లాడుతూ, కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికారక రసాయనాలు ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోందనీ, నిపుణులు పరీక్షించిన 107 ఆహార పదార్థాల్లో రోడమైన్‌-బి, టాట్రజైన్‌ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారనీ ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని అన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్‌ సెంటర్లపై అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. అయితే, ఎలాంటి రంగులద్దని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదని, వాటి విక్రయాలు కొనసాగించొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay: హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!

Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..

‘ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు’ స్టార్ హీరోయిన్ ఆవేదన