Karma: భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తుండగా.. ఊహించని ట్విస్ట్.

|

Sep 04, 2023 | 8:45 AM

ఎంతటివారికైనా, ఎప్పటికైనా కర్మఫలం అనుభవించక తప్పదని పెద్దలు చెబుతారు. అది మంచైనా, చెడైనా.. మంచిపనికి ప్రతిఫలం కాస్త ఆలస్యంగా వస్తుందేమో కానీ, చెడు కర్మలకు ఫలితం వెంటనే చూపిస్తోందా అనిపిస్తోంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి వెంటనే అనుభవించాడు. కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తుండగా ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు.

ఎంతటివారికైనా, ఎప్పటికైనా కర్మఫలం అనుభవించక తప్పదని పెద్దలు చెబుతారు. అది మంచైనా, చెడైనా.. మంచిపనికి ప్రతిఫలం కాస్త ఆలస్యంగా వస్తుందేమో కానీ, చెడు కర్మలకు ఫలితం వెంటనే చూపిస్తోందా అనిపిస్తోంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి వెంటనే అనుభవించాడు. కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తుండగా ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్లోని బంగారిగూడలో జరిగింది. భరత్ అరుణ్ అనే యువకుడికి బాల్కొండకు చెందిన దీప్తి అనే అమ్మాయితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే భార్యపై అనుమానం మొదలైంది. అది పెనుభూతంగా మారడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈరోజు కూడా వీరిద్దరి మధ్య గొడవ తలెత్తింది. దాంతో కోపోద్రిక్తుడైన అరుణ్.. భార్యను చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోదామని బైక్‌పైన వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..