Kappathalli celebration: ఆ ఊరిపై పగబట్టిన వరుణుడు.. గ్రామస్తులు కప్పతల్లి ఆటలతో అంటూ.. చిందులు..

Updated on: Sep 12, 2022 | 9:51 AM

ఈ సంవత్సరం అంతటా అధిక వర్షాలే కురిశాయి. కుండపోత వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి కూడా. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయి. కానీ, ఓ ఊరిలో మాత్రం వర్షం జాడేలేదు.


ఈ సంవత్సరం అంతటా అధిక వర్షాలే కురిశాయి. కుండపోత వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి కూడా. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయి. కానీ, ఓ ఊరిలో మాత్రం వర్షం జాడేలేదు. అంతటా అధికవృష్టి, అక్కడ మాత్రం అనావృష్టి తాండవం చేస్తుంది. పక్కనే ఉన్నటువంటి గ్రామాలలో కుంభవృష్టిగా కురిసిన వానలు..ఈ ఊరును మాత్రం కనీసం పలకరించలేదు. మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. దీంతో వానలు కురవాలంటూ వరుణ దేవుడిని వేడుకుంటున్నారు. కరుణించు వరుణుడా అంటూ మొరపెట్టుకుంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం అనే ఈ గ్రామంలో 40 రోజులుగా వర్షాలు లేవు. సీజన్‌ ప్రారంభంలో పడిన వాన మినహా మళ్లీ వర్షాలు పడలేదు. పరిసర గ్రామాలలో వర్షాలు కురిసినా, ఈ గ్రామంపై వరుణ దేవుడు పగబట్టాడా..? అన్నట్టుగా 40 రోజులుగా చుక్క వాన లేదు. దీంతో పంటచేలు ఎండిపోతున్నాయి. పశువుల మేత కూడా ఎండిపోయి పచ్చగడ్డి కరువైంది. చేసేది లేక గ్రామస్తులంతా కలిసి చిన్నా పెద్ద ఐక్యమై కప్పతల్లి ఆట ఆడారు.. ఓ రోకలికి కప్పను కట్టి, పిల్లలు నడుముకు, కాలికి గజ్జెలు కట్టుకుని, కప్పను కట్టిన రోకలిని భూజాన మోసుకుంటూ డ్యాన్స్‌లు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పలకు స్నానం చేయించారు. వాటికి నీళ్లు పోసి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ శివారులో ఆ కప్పను వదిలిపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 12, 2022 09:51 AM
Loading...
Unable to load recommendations.
Follow Us