కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!

Updated on: Oct 01, 2026 | 5:06 PM

కన్యాకుమారి జిల్లాకు చెందిన యూట్యూబర్‌, ఇన్‌ఫ్లుయెన్సర్‌ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 118 సవర్ల బంగారం, డైమండ్‌ నగలు, నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు నమోదైంది. ఆమె సోషల్‌ మీడియా పోస్టుల్లో బంగారం, నగదు, కుటుంబ ప్రయాణ వివరాలను పంచుకోవడంపై పోలీసులు దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే మధుమిత వరుసగా రీల్స్‌ పోస్ట్‌ చేయడం కూడా సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి 98 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగినా ఆమె ఏమాత్రం తగ్గకుండా చేసిన రీల్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కన్యాకుమారి జిల్లాకు చెందిన మధుమిత, ఆమె భర్త వినోద్ కుమార్ తమ కుమార్తె పుట్టినరోజు దుస్తుల కొనుగోలుకు బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ.కోటి విలువైన 118 సవర్ల బంగారం, డైమండ్ నగలు, నగదు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా.. సోషల్ మీడియాలో నగలు, డబ్బు ప్రదర్శించడం, బయటకు వెళ్లే వివరాలు పోస్ట్ చేయడమే దొంగలకు ఆధారంగా మారిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే కోట్ల రూపాయల దొంగతనం జరిగిన కొద్ది గంటల్లోనే మధుమిత ఇన్‌స్టాగ్రామ్‌లో తలపై డబ్బు కట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తూ 10 రీల్స్ పోస్ట్ చేసింది. “ఏదీ శాశ్వతం కాదు” అనే క్యాప్షన్‌తో పెట్టిన ఈ వీడియోలకు ఏకంగా కోట్లలో వ్యూస్, లక్షలాది ఫాలోవర్లు పెరిగారు. భారీ చోరీ జరిగినా ఆమె ఈ రీల్స్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్‌ ప్లాన్‌.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Loading...
Unable to load recommendations.
Follow Us