నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

Updated on: Feb 10, 2026 | 6:43 PM

₹20 లంచం ఆరోపణతో గుజరాత్‌లో ఓ కానిస్టేబుల్ 27 ఏళ్లు న్యాయపోరాటం చేశారు. జిల్లా కోర్టు శిక్షించినా హైకోర్టును ఆశ్రయించి, చివరికి తాను నిర్దోషి అని తీర్పు వచ్చిన రోజే కన్నుమూశారు. న్యాయం గెలిచిన ఆనందంలోనే ప్రాణాలు వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యాయం కోసం సామాన్యుడి ఆవేదనకు ఇది నిదర్శనం.

న్యాయం గెలిచింది.. కానీ ఆ విజయాన్ని అనుభవించేందుకు ఆయుష్షు సరిపోలేదు. కేవలం 20 రూపాయల లంచం ఆరోపణతో 27 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్, తాను నిర్దోషి అని హైకోర్టు తీర్పునిచ్చిన రోజే కన్నుమూశారు. సినిమాని తలపించే ఈ హృదయ విదారక ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 1997లో అహ్మదాబాద్‌లోని వేజల్పూర్ వద్ద ఒక కానిస్టేబుల్ 20 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. 2004లో జిల్లా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 27 ఏళ్ల పాటు పోరాడారు. చివరకు గుజరాత్ హైకోర్టు ఆయనను పూర్తి నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత తన న్యాయవాది కార్యాలయానికి వెళ్లి ఎంతో సంతోషంగా గడిపిన ఆయన, “నాపై ఉన్న మచ్చ తొలగిపోయింది.. ఇక దేవుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధమే” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అన్నట్టుగానే, ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన సహజ కారణాలతో తుదిశ్వాస విడిచారు. తన జీవితకాల స్వప్నం నెరవేరిన సంతృప్తితోనే ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తీర్పు వచ్చిన రోజున ఆయన న్యాయవాది ఆఫీసులో ఆనందంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయం కోసం ప్రాకులాడే సామాన్యుడి ఆవేదనకు, నిజాయితీకి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు

ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు

ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా

ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. ఆత్మహత్యా ?? లేక హత్యా ??