Crime: జమ్మూకశ్మీర్ లో పోలీస్ నిర్వాకం.. డీఎస్‌పీగా ఉద్యోగం కానీ డ్యూటీ ఉగ్రవాదంలో..!
ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్‌పీని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు డీఎస్‌పీ ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. ఇక, ట్విటర్‌లోనూ ఇతడో సెలబ్రిటి.. ఏకంగా 44వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. . జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్‌పీని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు డీఎస్‌పీ ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. ఇక, ట్విటర్‌లోనూ ఇతడో సెలబ్రిటి.. ఏకంగా 44వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. . జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు. తాజాగా ముస్తాక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. డీఎస్పీకి వ్యతిరేకంగా టెక్నికల్ సాక్ష్యాలతోపాటు క్యాష్ ఎలా అతడి వద్దకు చేరిందనే అంశాలను కూడా సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. లష్కరే తొయిబాకు నిధులు సేకరించే ముజ్మిల్ జహూర్‌తో డీఎస్పీ ఆదిల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిని ఆదిల్ అరెస్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి డీఎస్పీ రూ.5 లక్షలు సొమ్ము తీసుకొన్నట్లు తేలింది. దర్యాప్తు అధికారులపైనే ఉగ్రవాదులు ఆరోపించినట్లు తప్పుడు ఫిర్యాదులను కూడా ఆదిల్ సృష్టించాడు. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌లో బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆదిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతడి బాధితులు క్రమంగా పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
