కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..
మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో కారు కాలువలోకి దూసుకెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. భోపాల్-బేతుల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో, వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. అర్ధరాత్రి కావడంతో, బలమైన ప్రవాహంలో బయటపడలేక యువకులు ప్రాణాలు కోల్పోయారు. కారులో మద్యం సీసాలు లభ్యం కావడంతో వేగం, నిర్లక్ష్యం కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇటార్సీ జిల్లాలో భోపాల్-బేతుల్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు, పత్‌రోటా కాలువ వంతెన వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి కావడం, కాలువలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు నీట మునిగి అందులోని వారు బయటపడే అవకాశం లేకపోయింది. ప్రమాదంలో ముగ్గురు జలసమాధి అయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, రెస్క్యూ టీమ్ కాలువలోకి దిగి, గంటన్నర శ్రమించి, ప్రవహిస్తున్న నీటి నుంచి కారును బయటకు తీసింది. అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను వెలికితీసింది. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. కాలువ రైలింగ్‌ను ఢీకొట్టి కారు నీటిలో పడటాన్ని చూస్తే, వాహనం అత్యంత వేగంతో ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. కారు కాలువలో పడిన సమయంలో తమను రక్షించాలంటూ కారులోని యువకులు కేకలు వేసారని స్థానికులు తెలిపారు. అప్పటివరకు సంతోషంగా ప్రయాణిస్తున్న వారు ఒక్క క్షణంలో విగతజీవులుగా మారడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. మృతిచెందిన ముగ్గురు యువకుల్లో ఒకరిని రైసల్పూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలువ సమీపంలో ఢాబాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల కోసం వెతుకుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం
బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!
ఇక 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు