ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ కాస్తా ??

Updated on: May 18, 2024 | 2:36 PM

ఆవలింతలు రావడం సహజం.. ఒకరికి ఆవలింత వస్తే పక్కనున్నవారికి ఆటోమేటిక్‌గా ఆవలింతలు వస్తాయి. తాజాగా ఈ ఆవలింత ఓ యువతికి పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. బలవంతంగా ఆవలించడంతో ఆమె దవడ లాక్‌ అయిపోయింది. తెరిచి ఉన్న నోరుతోనే డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా అనే 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరిచి ఆవలించింది.

ఆవలింతలు రావడం సహజం.. ఒకరికి ఆవలింత వస్తే పక్కనున్నవారికి ఆటోమేటిక్‌గా ఆవలింతలు వస్తాయి. తాజాగా ఈ ఆవలింత ఓ యువతికి పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. బలవంతంగా ఆవలించడంతో ఆమె దవడ లాక్‌ అయిపోయింది. తెరిచి ఉన్న నోరుతోనే డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా అనే 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరిచి ఆవలించింది. అంతే దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. తిరిగి నోరు మూతపడకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె బాధతో విలవిల్లాడింది. అలా నోరు పెద్దగా తెరుచుకొని ఉన్న స్థితిలోనే ఆసుపత్రికి పరిగెత్తింది. తన సమస్యను వైద్యులకు వివరించేందుకు తను నోరు సహకరించకపోవడంతో ఓ బంధువు సాయం తీసుకుంది. దీంతో అవాక్కయిన డాక్టర్లు ఆమెకు తొలుత ఎక్స్ రే తీశారు. ఆమె బలంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. కొన్ని గంటలపాటు మరికొన్ని పరీక్షల తర్వాత చికిత్స చేశారు. ఆమెకు నొప్పి తగ్గడానికి ముందుగా నోటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చివరకు తల నుంచి దవడ దాకా పెద్ద కట్టు కట్టారు. దీంతో ఆమె దవడ తిరిగి యథా స్థానంలోకి వచ్చింది. తన చికిత్సకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోను 24 లక్షల మంది వీక్షించారు. ఆమె పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత అందమైన అమ్మాయికి ఎంత కష్టం వచ్చిపడిందంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ సమస్య ఎదురైతే ఆమె లాగా ప్రశాంతంగా ఉండటం నావల్ల కాదంటూ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే

చనిపోయన పాముకు ఘనంగా అంతిమయాత్ర

AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన

TOP 9 ET News: గుడ్‌ న్యూస్‌ !..ప్రభాస్‌ భారీ ఈవెంట్ | వావ్ ! మరో ప్రెస్టీజియస్ సినిమాలో సూర్య

Loading...
Unable to load recommendations.
Follow Us