సీతారాముల వేషధారణలో ఇండిగో సిబ్బంది
ఆసేతుహిమాచలం రామనామ స్మరణతో పులకించిపోతోంది. ఎవరి నోట విన్నా అయోధ్యరాముని ప్రస్తావనే.. అవును శ్రీరాముడు అంటే ప్రతి ఇంటి దైవం.. దేవుడిలా కొలవడమే కాదు.. తమ ఇంటి పెద్ద కుమారుడిలో శ్రీరాముడిని చూసుకుంటారు. తమ పిల్లలు శ్రీరామ సోదరుల్లా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. ప్రతి తల్లీ తన బిడ్డలో బాలరాముడినే చూసుకుంటుంది... ఆ రామనామంతోనే జోలపాడుతుంది. అలాంటి ముద్దులొలికే అందాల బాలరాముడు అయోధ్యలో కొలువుతీరుతూ అందరినీ రారమ్మన్ని ఆహ్వానిస్తున్నాడు.
ఆసేతుహిమాచలం రామనామ స్మరణతో పులకించిపోతోంది. ఎవరి నోట విన్నా అయోధ్యరాముని ప్రస్తావనే.. అవును శ్రీరాముడు అంటే ప్రతి ఇంటి దైవం.. దేవుడిలా కొలవడమే కాదు.. తమ ఇంటి పెద్ద కుమారుడిలో శ్రీరాముడిని చూసుకుంటారు. తమ పిల్లలు శ్రీరామ సోదరుల్లా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. ప్రతి తల్లీ తన బిడ్డలో బాలరాముడినే చూసుకుంటుంది… ఆ రామనామంతోనే జోలపాడుతుంది. అలాంటి ముద్దులొలికే అందాల బాలరాముడు అయోధ్యలో కొలువుతీరుతూ అందరినీ రారమ్మన్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ సుమధుర ఘడియల కోసం ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాములోరి భక్తులను అయోధ్యకు చేర్చడానికి రవాణా వ్యవస్థ సైతం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండిగో నేరుగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమానాలు నడుపుతున్నట్టు ప్రకటించింది. రైల్వే సైతం ఏకంగా వెయ్యి రైళ్లకు పైగా నడుపుతోంది. జనవరి 22న జరిగే కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండిగో సంస్థ తన తొలి విమానాన్ని గురువారం ప్రారంభించింది. వారానికి మూడు రోజులు అహ్మదాబాద్- అయోధ్యల మధ్య ఇండిగో విమానం నడపనుంది. లఖ్‌నవూ నుంచి వర్చువల్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ఈ విమానాన్ని ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్.. విద్యార్ధులకు ఫ్రీ ఎంట్రీ
భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023
వెజ్ మీల్‌లో నాన్‌వెజ్.. ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం
స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్ ఆర్1’