2024 Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో అన్నం., పప్పు, కూర.! వరల్డ్ వైడ్ గా ఇండియన్ ఫుడ్.

|

Apr 05, 2024 | 10:08 PM

ఈ ఏడాది జ‌రిగే పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త అథ్లెట్ల‌కు భోజ‌న ఇబ్బందులు త‌ప్ప‌నున్నాయి. అథ్లెట్ల గ్రామంలో మనోళ్ల‌కు ఎంచ‌క్కా ప‌ప్పు, అన్నం, పెరుగు, చ‌పాతీ వంటి దేశీ భోజ‌నం ల‌భించ‌నుంది. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భార‌త అథ్లెట్లు ఈసారి బాస్మ‌తి అన్నం, ప‌ప్పు, చ‌పాతీ, ఆలుగ‌డ్డ క‌ర్రీ, కోడి కూర‌, పులుసులు తినొచ్చు. భార‌త అథ్లెట్ల‌కు ఆహారం కోసం ఇప్ప‌టికే ఒలింపిక్స్ నిర్వాహ‌కుల‌కు ఈ మేర‌కు భోజ‌నాల ప‌ట్టిక పంపించామ‌ని భార‌త డిప్యూటీ చెఫ్ డి మిష‌న్ శివ కేశ‌వ‌న్ వెల్ల‌డించారు.

ఈ ఏడాది జ‌రిగే పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త అథ్లెట్ల‌కు భోజ‌న ఇబ్బందులు త‌ప్ప‌నున్నాయి. అథ్లెట్ల గ్రామంలో మనోళ్ల‌కు ఎంచ‌క్కా ప‌ప్పు, అన్నం, పెరుగు, చ‌పాతీ వంటి దేశీ భోజ‌నం ల‌భించ‌నుంది. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భార‌త అథ్లెట్లు ఈసారి బాస్మ‌తి అన్నం, ప‌ప్పు, చ‌పాతీ, ఆలుగ‌డ్డ క‌ర్రీ, కోడి కూర‌, పులుసులు తినొచ్చు. భార‌త అథ్లెట్ల‌కు ఆహారం కోసం ఇప్ప‌టికే ఒలింపిక్స్ నిర్వాహ‌కుల‌కు ఈ మేర‌కు భోజ‌నాల ప‌ట్టిక పంపించామ‌ని భార‌త డిప్యూటీ చెఫ్ డి మిష‌న్ శివ కేశ‌వ‌న్ వెల్ల‌డించారు. భార‌త వంట‌కాల‌తో కూడిన మెను ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌కు అంగీకారం ల‌భించిందనీ పోష‌కాహార నిపుణుడి సూచ‌న‌ల మేరకే ఈ దేశీ వంట‌కాల‌ మెనును త‌యారు చేసినట్లు శివ కేశవన్‌ తెలిపారు. మ‌న అథ్లెట్ల విష‌యంలో ఆహారం అనేది స‌మ‌స్య అనీ ఒలింపిక్స్‌లో ప్ర‌ధాన భోజ‌నశాల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల వంట‌కాలు ఉంటాయి కానీ మ‌న‌వాళ్ల కోసం ద‌క్షిణాసియా వంట‌కాలు కావాల‌ని కోరినట్లు చెఫ్‌ తెలిపారు. రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్‌, క్రికెట‌ర్ రిష‌భ్ పంత్‌కు చికిత్స అందించిన డాక్ట‌ర్ దిన్‌షా ప‌ర్దీవాలా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అథ్లెట్ల గ్రామంలో భార‌త క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేశ‌వ‌న్ తెలిపారు. ఈ కేంద్రంలో అథ్లెట్లు కోలుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన మందులు, సామగ్రి అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఇక ఈ సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం ఇండియా నుంచి భారీ సంఖ్య‌లో యంత్రాల‌ను అక్క‌డికి చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on