India vs Canada: కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

|

Oct 21, 2024 | 9:43 AM

మీ దేశానికి మా దేశం ఎంత దూరమో.. మా దేశానికి మీ దేశం కూడా అంతే దూరం. కెనడాకు ఈ విషయం అర్థం కానట్టుంది. భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇంకా దానికి తెలిసిరాలేదు. కేవలం సొంతగడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. మనపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. మన దేశంతో దౌత్యపరమైన సంబంధాలను పణంగా పెట్టారు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.

ఇప్పుడు ఇండియా రియాక్షన్ చూసేసరికీ.. ట్రూడోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు.. ట్రూడో మనతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు మనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు? మన విషయంలో ట్రూడో ఎందుకు అంత ఓవర్ యాక్టివ్ గా ఉన్నారు? దీని వెనుక అసలు కథేంటి?

ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు విషయంలో కెనడా ఓవర్ యాక్షన్ చేస్తోంది. మనపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక మన అధికారుల పాత్ర ఉందని.. కెనడా పార్లమెంటులో ప్రధాని ట్రూడో.. కిందటేడాది ఓ ప్రకటన చేశారు. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగింది. దాని గురించి పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏకంగా.. కెనడాలో మన హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు అక్కడి మన దౌత్యవేత్తలను నిజ్జర్ హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్నట్టు చెప్పింది.

సంజయ్ కుమార్ వర్మను పర్సన్ ఆఫ్ ఇంట్రస్ట్ గా కెనడా ప్రకటించింది. అంటే నిజ్జర్ కేసులో విచారిస్తామని చెప్పింది. మామూలుగా అయితే విదేశాల్లో పనిచేసే దౌత్య సిబ్బందికి దౌత్యపరమైన ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటివేమీ పట్టించుకోకుండా.. మన రాయబారి సంజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ను కూడా లెక్కచేయకుండా.. ఆయనపై ఆరోపణలు చేస్తూ.. విచారిస్తామని చెప్పడం వెనుక కారణమేంటి? అందుకే దీనిని మన దేశం చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ.. వెంటనే రియాక్ట్ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.