Viral: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. హోంగార్డు నిరసన.
పలుకుబడి, డబ్బు ఉంటే ఏ కేసు నుంచి అయినా బయటపడడం మన దేశంలో చాలా సులువు. చిన్నచిన్న నేరాల నుంచి తప్పించుకోవడం మరింత సులువు. గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అన్నీ సాఫీగానే సాగిపోతుంటాయి. ఇక పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది స్వార్థపరుల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది.. నేరస్తులను పోలీసులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని..
పలుకుబడి, డబ్బు ఉంటే ఏ కేసు నుంచి అయినా బయటపడడం మన దేశంలో చాలా సులువు. చిన్నచిన్న నేరాల నుంచి తప్పించుకోవడం మరింత సులువు. గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అన్నీ సాఫీగానే సాగిపోతుంటాయి. ఇక పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది స్వార్థపరుల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది.. నేరస్తులను పోలీసులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని స్వయంగా ఓ హోంగార్డే రోడ్డుకెక్కి నిరసన తెలిపాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. తను ఎంతో కష్టపడి దొంగలను పట్టుకుని వస్తుంటే పోలీసులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని ఓ హోంగార్డు రోడ్డుపైన పడుకుని నిరసన తెలిపాడు. తను పని చేసే స్టేషన్‌లో పోలీసులు మరీ బాధ్యతారహింగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. జూలై 21న పఠాన్‌కోట్ హైవేపై అతడు రోడ్డుకు అడ్డంగా ఓ తాడు కట్టి మరీ ధర్నా చేశాడు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు అతణ్ని అక్కడినుంచి పంపడానికి ప్రయత్నించగా ఓ బస్సు ముందు పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంగార్డు ఆరోపణలపై భోగ్‌పూర్ స్టేషన్ ఇన్‌చార్జ్ స్పందించారు. ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకొచ్చాడని, అయితే అతడిని బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు. లంచం తీసుకునే వదిలేస్తున్నారని హోం గార్డు వాదిస్తున్నాడు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...