టీవీలో సినిమా చూస్తున్న భార్య చితక్కొట్టిన భర్త.. ఎందుకో తెలిస్తే..
భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే కారణాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. తన భార్య సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తోందని భార్యను చితకబాదాడు ఓ భర్త. గుజరాత్ లోని వడోదరకు చెందిన దంపతులకు కొన్నాళ్ల కిందట పెళ్లయింది. భార్యకు సల్మాన్ ఖాన్ అంటే వీరాభిమానం. ఓసారి సల్మాన్ ఖాన్ సినిమా చూసిన ఆమె అతడిని కాస్త ఎక్కువగా ప్రశంసించడంతో భర్తకు కోపం తెప్పించింది.
భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే కారణాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. తన భార్య సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తోందని భార్యను చితకబాదాడు ఓ భర్త. గుజరాత్ లోని వడోదరకు చెందిన దంపతులకు కొన్నాళ్ల కిందట పెళ్లయింది. భార్యకు సల్మాన్ ఖాన్ అంటే వీరాభిమానం. ఓసారి సల్మాన్ ఖాన్ సినిమా చూసిన ఆమె అతడిని కాస్త ఎక్కువగా ప్రశంసించడంతో భర్తకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఆమెను సల్మాన్‌ఖాన్ సినిమాలు చూడ వద్దని ఆర్డర్ వేశాడు. టీవీలో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంటే వెంటనే చానల్ మార్చేసేవాడు. కనీసం వాణిజ్యప్రకటనల్లో కూడా సల్మాన్ ఖాన్ ను చూడడాన్ని ఇష్టపడేవాడు కాదు. చివరికి రోడ్డు పక్కన సల్మాన్ ఖాన్ బొమ్మ ఉన్న హోర్డింగ్స్ ను కూడా చూడవద్దని భార్యకు ఆంక్షలు విధించాడు. ఇటీవల టీవీలో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంటే భార్య ఆ సినిమా చూస్తోంది. అది గమనించిన సదరు భర్త పట్టరాని కోపంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దాంతో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించింది. మహిళ భర్తను స్టేషన్ కు పట్టుకొచ్చిన పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితవు పలికారు. అనంతరం వారిని పంపించివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెటర్ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం
Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్ !!
Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్
Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్ !! విని ఫిదా అయిన చిరు !!
Jawan: వావ్ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్ !!