అయ్యబాబోయ్‌.. ఇంట్లో కి వెళ్లగానే యజమానికి భారీ షాక్‌

|

Oct 27, 2024 | 9:18 PM

నిర్మల్ జిల్లా బాసర గణేష్ నగర్ కాలనీలో కొండచిలువ కలకలం రేపింది. ఒక ఇంటి ఆవరణలో కనిపించిన భారీ కొండచిలువ స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేసింది. బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ ఇంట్లోని వారిని అప్రమత్తం చేశారు.

అటు పాములు పట్టుకునే ఫయాజ్‌కు సమాచారం అందించారు. కొండపై నుంచి కిందకు దూసుకొచ్చిన కొండచిలువను చూసిన స్థానికులు, ఆ ఇంటివారు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించాడు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఔరా అనిపించేలా స్నేక్‌ క్యాచర్‌ కొండచిలువను పట్టుకున్నతీరుకు కాలనీవాసులను అబ్బురపరిచింది. వారంతా ఫయాజ్ ని అభినందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరకులో హాట్‌ ఎయిర్‌ బెలూన్స్‌.. 300 అడుగుల ఎత్తునుండి అందాలు వీక్షించే అవకాశం