మాలోనూ మనసుంది.. పావురాలపై గుర్రం ప్రేమ.. ఏం చేసిందో చూడండి
ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. ఆకలి బాధేంటో కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ అర్ధమైంది.
ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. ఆకలి బాధేంటో కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ అర్ధమైంది. ఆ సమయంలో మనుషులు, పశుపక్ష్యాదులు కూడా ఆకలితో అలమటించాయి. ఎందరో దయార్ధహృదయంతో తోటి మనుషులకు, మూగజీవులకు కూడా ఆహారం పంచి వారి మంచిమనసును చాటుకున్నారు. తాజాగా ఓ గుర్రం తనలోనూ మంచి మనసు ఉందని చాటుకుంది. ఆహారం తింటున్న తన వద్దకు వచ్చిన పక్షులకు ఆహారాన్ని పంచింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు స్పూర్తిగా నిలుస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గుర్రం దానా తింటూ ఉంది. అది గమనించిన కొన్ని పావురాలు ఆ గుర్రం వద్దకు వచ్చాయి. గుర్రం దానా తింటుండగా రాలిపడిన గింజలను తింటున్నాయి. గుర్రం ఏమైనా చేస్తుందేమోనని ఓవైపు భయపడుతూనే గింజలు తింటున్నాయి పావురాలు. సాధారణంగా జంతువులు తాము తింటున్న ఆహారం వైపు పక్షులుగానీ, ఇతర జంతువులు గాని వస్తే ఊరుకోవు.. వాటిని తరిమేస్తాయి. కానీ ఈ గుర్రం అలా చేయలేదు సరికదా… వాటికి మరిన్ని గింజలు ఆహారంగా వేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీ టెన్త్ గ్రేడ్ మెమో వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా ??
జలపాతం కాదు.. నెత్తురుపాతం.. ఎక్కడో తెలుసా ??
హత్య కేసులో చిలుక సాక్ష్యం !! నిందితుడికి జీవిత ఖైదు !!
ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??
అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే