Snowfall: మంచు దుప్పటి అంటే ఇదేనేమో.! మంచులో స్కీయింగ్‌ చేస్తూ పర్యాటకులు ఎంజాయ్‌.

|

Feb 06, 2024 | 3:05 PM

దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కశ్మీర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమపాతంతో గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 72 గంటలుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ లలోనే రికార్డవుతున్నాయి. అడుగులకొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్ మార్గ్ అంటార్కిటికాను తలపిస్తోంది. వింటర్ లో స్కీయింగ్ కు గుల్ మార్గ్ పేరుపొందింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ సీజన్ లో గుల్ మార్గ్ చేరుకుంటారు.

దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కశ్మీర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమపాతంతో గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 72 గంటలుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ లలోనే రికార్డవుతున్నాయి. అడుగులకొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్ మార్గ్ అంటార్కిటికాను తలపిస్తోంది. వింటర్ లో స్కీయింగ్ కు గుల్ మార్గ్ పేరుపొందింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ సీజన్ లో గుల్ మార్గ్ చేరుకుంటారు. మూడు రోజులుగా మంచు కురుస్తూనే ఉండడంతో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో ఓ టూరిస్టు రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు పేరుకుపోయిన చెట్ల మధ్య పాములా మెలికలు తిరిగిన రోడ్డు.. దానిపై ఒకటీ అరా కార్లు వెళుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. ఓవైపు మంచు కురుస్తున్నా టూరిస్టులు స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కాగా, శ్రీనగర్ లో హిమపాతం కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ ను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ – జమ్మూ హైవేపై ట్రక్కులు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హిమపాతం కారణంగా మంచుగడ్డలు దొర్లి పడవచ్చని, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on