Libya Floods: ఇళ్లతో సహా సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. 10 వేల మంది గల్లంతు..

Updated on: Sep 13, 2023 | 11:50 PM

భారీ వరదలకు ఏకంగా ఇళ్లతో సహా వేలాదిమంది జనం సముద్రంలో కలిసిపోయారు. ఈ దారుణ విపత్తు లిబియాలో చోటుచేసుకుంది. భారీ తుపాను, ఎడతెరిపి లేని వానల కారణంగా వరదలు సంభవించడంతో తూర్పు లిబియాలో దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మంది గల్లంతయ్యారు. డెర్నా నగరంలోకి వరద భారీగా ముంచెత్తడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది.

భారీ వరదలకు ఏకంగా ఇళ్లతో సహా వేలాదిమంది జనం సముద్రంలో కలిసిపోయారు. ఈ దారుణ విపత్తు లిబియాలో చోటుచేసుకుంది. భారీ తుపాను, ఎడతెరిపి లేని వానల కారణంగా వరదలు సంభవించడంతో తూర్పు లిబియాలో దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మంది గల్లంతయ్యారు. డెర్నా నగరంలోకి వరద భారీగా ముంచెత్తడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. డెర్నా పైన ఉన్న డ్యామ్‌లు కూలడంతోనే ఈ విపత్తు సంభవించినట్టు లిబియన్ నేషనల్ ఆర్మీ తెలిపింది. వరదల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు పేర్కొంది. డెర్నాలో 250 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సెప్టెంబర్‌ 12న రెడ్ క్రీసెంట్ ఎయిడ్ గ్రూప్ తెలిపింది. లిబియా 2011లో రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయింది. ట్రిపోలీలో అంతర్జాతీయంగా గుర్తించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ తూర్పు ప్రాంతాలపై దానికి నియంత్రణ లేకుండా పోయింది. ఈ విపత్తులో 5 వేల మందికిపైగా మరణించారని, 10 వేల మంది గల్లంతయ్యారని తూర్పు ప్రాంత అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. వరద 10 అడుగుల మేర ముంచెత్తినట్టు స్థానికులు తెలిపారు. పశ్చిమ డెర్నాలో ధ్వంసమైన రోడ్లు, కుప్పకూలిన ఇళ్లతో భయానకంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 13, 2023 10:10 PM
Follow Us