రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో
పల్లీలు వీటినే వేరుశెనగలు అని కూడా అంటారు. ఈ పల్లీలను పేదవాడి కాజుగా పిలుచుకుంటారు. ఎందుకంటే జీడిపప్పుతో సమానమైన పోషకాలు వీటిలో ఉంటాయి. పల్లీలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. ఖరీదైన కాజు, బాదం, పిస్తాల్లో ఉండే పోషకాలు పల్లీల్లో కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజు గుప్పెడు పల్లీలు తినటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
పల్లీలను సరైన మోతాదులో ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో పల్లీలు అద్భుతంగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ముఖ్యంగా గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా పల్లీలు అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు పల్లీలు తినటం వల్ల ట్రిప్టోఫాన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది తరచుగా హ్యాపీ హార్మోన్ అని పిలవబడే సెరిటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి నిరాశను తగ్గిస్తుంది. జింక్ పుష్కలంగా ఉండే వేరుశెనగలు తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది. విటమిన్ ఈ పుష్కలంగా ఉండే పల్లీలు తినడం వల్ల మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది.