డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్
మిర్చి పంట విక్రయించి వచ్చిన రూ.1.5 లక్షల నగదును బైక్‌పై వెళ్తుండగా పోగొట్టుకున్న గుంటూరు రైతుకు లాలాపేట పోలీసులు అండగా నిలిచారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, డబ్బుల సంచిని తీసుకెళ్లిన వ్యక్తిని గంటల్లోనే గుర్తించి నగదును స్వాధీనం చేసుకుని రైతుకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై రైతు కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించగా వచ్చిన సొమ్ము కళ్లముందే మాయమైతే ఆ రైతు గుండె ఆగినంత పనైంది. కానీ గుంటూరు లాలాపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, సీసీ కెమెరాల సాయంతో కేవలం గంటల వ్యవధిలోనే ఆ నగదును వెతికి తెచ్చిచ్చి ఆ రైతు కళ్లలో ఆనందం నింపారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంటకు చెందిన మారిశెట్టి బ్రహ్మయ్య అనే రైతు తాను పండించిన మిర్చి పంటను విక్రయించగా వచ్చిన రూ. 1.5 లక్షల నగదును ఒక సంచిలో పెట్టుకుని, బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. తీరా ఇంటికెళ్లి చూసేసరికి బైక్‌లో డబ్బుల సంచి కనిపించలేదు. ఆందోళనతో అతను వెంటనే లాలాపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ శివప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. రైతు ఆవేదనను అర్థం చేసుకున్న సీఐ, వెంటనే కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్‌లను అలర్ట్ చేశారు. మార్కెట్ సెంటర్ నుండి రైతు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఎత్తురోడ్డు ప్రాంతంలో వెళ్తుండగా రైతుకు తెలియకుండానే బైక్ నుండి డబ్బుల సంచి కింద పడిపోవడాన్ని, ఆ వెనుక వస్తున్న ఓ వ్యక్తి దాన్ని తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా ఆ వ్యక్తి బైక్ నంబర్ ట్రేస్ చేసి, అతని వద్ద నుండి లక్షన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. పోయిన డబ్బును తిరిగి సీఐ చేతుల మీదుగా అందుకున్న రైతు బ్రహ్మయ్య పోలీసులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!