పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక

Updated on: May 30, 2026 | 11:26 AM

మహారాష్ట్రలోని బహాదర్‌పురా గ్రామానికి చెందిన వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ తన పెళ్లిని సామాజిక సేవా కార్యక్రమంగా మలిచారు. వివాహ కానుకగా గ్రామంలోని 3,465 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష ప్రమాద బీమా కల్పించారు. మొత్తం రూ.33.6 కోట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీతో గ్రామ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

వివాహ వేడుక అనగానే బ్యాండ్‌బాజాలు, ఆర్భాటాలు, విందు వినోదాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బహాదర్‌పురా గ్రామానికి చెందిన వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ తన వివాహాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివాహానికి విచ్చేసిన అతిథులకే కాకుండా, తమ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ రూ.1 లక్ష చొప్పున ప్రమాద బీమాను ‘రిటర్న్ గిఫ్ట్’గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామ పరిసరాల్లో తరచూ జరిగే పిడుగుపాట్లు, పాము కాట్లు, వ్యవసాయ ప్రమాదాల బారిన పడే పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పేఠ్కర్ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మే 20న జరిగిన వివాహ వేడుకలో భాగంగా.. గ్రామ ఓటరు జాబితా ఆధారంగా ఎలాంటి వివక్ష, అదనపు పత్రాల అవసరం లేకుండా ఊరిలోని మొత్తం 3,465 మందికి ఒక సంవత్సరం పాటు వర్తించేలా రూ.33.6 కోట్ల గ్రూప్ ప్రమాద బీమా పాలసీని చేయించారు. గ్రామపంచాయతీ ద్వారా చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి ఎంత ఖర్చయిందనే విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. దానధర్మాల ఖర్చులను ప్రచారం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే వివరాలు దాచినట్లు వారు తెలిపారు. పెళ్లిళ్ల పేరిట వృథా ఖర్చులు చేసే ఈ రోజుల్లో, ఒక గ్రామానికే రక్షణ కవచంగా నిలిచిన పేఠ్కర్ కుటుంబంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం!

Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!

‘ఇండియన్స్‌ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

Follow Us