Viral Video: కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. పగలబడి నవ్విన బంధువులు.. ఫన్నీ వీడియో

Updated on: Mar 21, 2022 | 9:54 AM

సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది.


సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వధువు ఒక కొంటెపని చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అల్లరి అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్‌లు తమ అందమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి వివిధ రకాల పోజులు ఇవ్వాలని జంటలని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయం ఎంత ముదిరిపోయిందంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌లు నిర్వహిస్తున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి తర్వాత వధూవరులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వధువు తన చేతులతో వరుడికి అన్నం తినిపించాలని అనుకుంటుంది. ఇది చూసి పెళ్లికొడుకు సంతోషంతో పొంగిపోతాడు. అన్నం కలిపి నెమ్మదిగా అతనికి తినిపించడానికి ఎంతో ప్రేమగా చేయి అతని నోటిదాకా తీసుకెళుతుంది, కానీ సడెన్‌గా ఆ ముద్దని తనే తినేస్తుంది. ఇది చూసిన అక్కడున్నవారంతా పగలబడి నవ్వుతారు. పెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకు నోరెళ్లబెడుతాడు. అందరు అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి మరింత నవ్వుతారు. పెళ్లిలో ఇలాంటి సరదా సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు చిలిపి పెళ్లికూతరు అంటూ అమ్మాయిని అభినందిస్తున్నారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ చిలిపి ఈ వీడియోని వేలల్లో లైక్ చేశారు. తమదైన శైలిలో వధూవరులను అభినందిస్తున్నారు. ఆ క్యూట్‌ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Loading...
Unable to load recommendations.
Follow Us