వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

Updated on: Dec 17, 2025 | 5:35 PM

బరేలీలో జరిగిన ఓ వివాహంలో వరుడు చివరి నిమిషంలో బ్రెజ్జా కారు, రూ.20 లక్షల కట్నం డిమాండ్ చేశాడు. కుటుంబ గౌరవాన్ని తగ్గించిన దురాశాపరుడిని పెళ్లి చేసుకోనని వధువు నిరాకరించింది. పోలీసులు వరుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఏసీ, ఫ్రిజ్‌లతో పాటు లక్షల్లో నగదు డిమాండ్ చేసినట్లు వధువు తండ్రి తెలిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

మండపంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. మరికొన్ని నిమిషాల్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా మండపంలో కలకలం రేగింది. తనకు ఉన్నపళంగా బ్రెజ్జా కారు, 20 లక్షల క్యాష్‌ కట్నంగా ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పెళ్లిని రద్దు చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. వరుడు రిషబ్‌ను ఒప్పించేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారం చూసిన వధువు ఆ దురాశాపరుడిని వివాహం చేసుకోను అని అందరి ముందు ప్రకటించింది. తన పెళ్లిని రద్దు చేసింది. తన కుటుంబాన్ని గౌరవించని అబ్బాయితో కలిసి జీవించలేను అని ఆమె చెప్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తన తండ్రిని, సోదరుడిని కట్నం కోసం అతిథులందరి ముందు అవమానించాడనీ భవిష్యత్తులో తనను ఎలా గౌరవిస్తాడు? అలాంటి దురాశాపరుడిని వివాహ చేసుకోలేను అని వీడియోలో వధువు ఇంద్రపాల్ చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లింట వాగ్వాదం జరిగింది. కంటోన్మెంట్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వరుడు రిషబ్, అతని తండ్రి రామ్ అవతార్ ను అదుపులోకి తీసుకున్నారు. వధువు వైపు నుంచి అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. సిక్లాపూర్‌కు చందిన ఇంద్రపాల్ అనే యువతితో 8 నెలల క్రితం రిషబ్‌కు వివాహం నిశ్చయమైందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు. వివాహం నిశ్చయించే సమయంలో, వరుడి తండ్రి తమ కుమారుడికి ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చి పంపమని, కట్నం వద్దని చెప్పారట. మే లో ఓ హోటల్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించారని చెప్పుకొచ్చారు. వేడుకకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చు పెట్టామనీ వరుడికి బంగారు ఉంగరం, గొలుసు, రూ. 5 లక్షల నగదు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత వారి డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయనీ ఏసీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషిన్, నగలు, 1.2 లక్షల క్యాష్‌ వధువుతో పాటు పంపించాలని అడిగారట. పెళ్లి మండపం ఖరీదైన హోటల్‌లో ఏర్పాటు చేయాలని కోరడంతో అందుకూ అంగీకరించినట్లు చెప్పారు. చివరకు తాళి కట్టే సమయంలో రూ.20 లక్షల కార్‌, ఖరీదైన కారు కట్నంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని వరుడు బెదిరింపులకు దిగినట్లు వధువు తండ్రి మురళీ మనోహర్ మీడియాకు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు

నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..

2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే

బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..