gold smuggling: ఓరి మీ తెలివి తగలెయ్య.. బంగారు బట్టతల తళ తళ మెరిసిపోతుంటే ఎలా..

Updated on: Apr 29, 2022 | 9:11 PM

బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.


బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పొట్టలో, మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో గోల్డ్‌ను పెట్టుకుని స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బట్టతలను కవర్‌ చేస్తూ పెట్టుకున్న విగ్‌లో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.అబుదాబి నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడిని చూసి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే కస్టమ్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. అదే సమయంలో సదరు వ్యక్తి తడబడుతూ మాట్లాడడంతో అనుమానం మరింత ఎక్కువైంది. తనిఖీల్లో భాగంగా ప్రయాణికుడు పెట్టుకున్న విగ్ తీసి చూస్తే పేస్టు రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దాదాపు 630.45 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 30.55 లక్షలు ఉంటుందని, నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారుల తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us