ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??

Updated on: Feb 23, 2026 | 8:14 PM

ప్రపంచ రికార్డు సృష్టించిన గీ జెరోనిమో, అతి పెద్ద జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ విశేషాలు. ఈ రాకాసి నత్తలు 27.3 సెం.మీ పొడవు, కిలో బరువుంటాయి. ఇవి మొక్కలు, పంటలనే కాదు, కాంక్రీట్‌ను కూడా నాశనం చేస్తాయి. వేగంగా సంతతిని పెంచుకుంటూ అమెరికా వంటి దేశాలకు పెనుసవాలుగా మారాయి. మనుషులకు మెనింజైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గీ జోరోనిమో. ఈ జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సాధారణంగా నత్త చాలా చిన్న ప్రాణి. అయితే ‘గీ జెరోనిమో’ 27.3 సెంటీమీటర్ల పొడవుంది. పెంపుడు జంతువుగా పెరిగింది. దీని యజమాని ఇంగ్లాండ్‌లో ఉంటారు. ఈ నత్త దాదాపు కిలోగ్రామ్‌ బరువుంది. ఈ నత్తకు మందపాటి, శంఖాకారంలో చిప్ప ఉంది. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ ఆయుషు కాలం తొమ్మిదేళ్లు. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతాయి. ఈ నత్తలు ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. కానీ మనుషులతో పాటు దేశాలు దాటేసి అమెరికా చేరుకున్నాయి. 1960 సమయంలో ఓడల్లో సరుకుల ద్వారానో, పెంచుకునేందుకు, తినేందుకు తెచ్చుకునే మనుషుల ద్వారానో ఎలాగైతేనే అమెరికాకు చేరాయి ఈ రాకాసి నత్తలు. అలా తమ సంతతిని బాగా పెంచేసుకున్నాయి. అలా పెరిగి పెరిగిన ఈ నత్తలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో ఈ నత్తల సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు 10 ఏళ్ల పాటు కఠిన చర్యలే తీసుకున్నారు. వీటి కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా చాలా ప్రదేశాల్లో మరోసారి విజృంభిస్తూ వస్తున్నాయి. ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది..ఈ పన్నెండు వందల నత్తలు ఒక్కోటీ 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయన్నమాట.ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినటం ఖాయం. పంటల్ని నాశనం చేస్తుంటాయి. ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. మెదడుకు నీరు పట్టి.. తలనొప్పి, తీవ్ర జ్వరం, కండరాల బలహీనత, వణుకు, ఫిట్స్, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.. ఈ నత్తలు ఎంతటి ప్రమాదానికి కారణమవుతాయంటే..ఏకంగా కాంక్రీట్ ను కూడా తింటాయని.. దీనితో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అప్పట్లో అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌

నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత

Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..

మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

Follow Us