పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్

Updated on: May 29, 2026 | 4:02 PM

కర్ణాటకలోని మాండ్య జిల్లా మళవల్లి అడవిలో ఓ భారీ కొండచిలువ జింకను మింగేసిన ఘటన వైరల్‌గా మారింది. పెద్ద ఆహారాన్ని మింగిన తర్వాత భుక్తాయాసంతో కదలలేక అక్కడే పడిపోయిన ఆ కొండచిలువను స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొండచిలువల వేట తీరు, వాటి అపారమైన మింగే సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

అడవిలో మనుగడ సాగించడం అంటే నిరంతరం పోరాటమే. భారీ కొండచిలువలు ఆహారం కోసం వేటాడే క్రమంలో తమ శరీరం తట్టుకోలేనంత పెద్ద జంతువును మింగేస్తుంటాయి దవడలు ఎక్కువగా సాగుతాయి కాబట్టి ఆహారం ఎంత పెద్దదైనా దాన్ని అమాంతం మింగేయడం సాధ్యమవుతుంది.చివరకు దానిని జీర్ణించుకోలేక అష్టకష్టాలు పడతాయి. కొండచిలువలకు అపారమైన శక్తి ఉంటుంది. అవి తాము తినాలనుకునే జీవులపై ఒక్కసారిగా దాడి చేసి గట్టిగా చుట్టేసి పట్టు బిగించి నలిపేస్తాయి. . చుట్టూ గట్టిగా పట్టుబిగించడంతో నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక కానీ, కార్డియాక్ అరెస్ట్ వల్ల కాని ఆ జీవులు చనిపోతాయి. మనిషిని కొండచిలువ మింగేయడం అరుదే అయినప్పటికీ గత అయిదేళ్ల కాలంలో ఇండోనేసియాలో కొండచిలువలు మనుషులను చంపిన ఆధారాలున్నాయి. 2017లో ఒకరు, 2018లో ఇంకొకరు కొండచిలువ మింగేయడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరో ముగ్గురు వేర్వేరు ఘటనలలో దానికి ఆహారమయ్యారు. మనుషులను చంపి తినేసే వాటిని ‘రెటిక్యులేటడెడ్ పైథాన్’ జాతికి చెందినవిగా గుర్తించారు. అవి ఎక్కువగా ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి. ఈ రకం కొండచిలువలు 32 అడుగుల వరకు పెరుగుతాయి. మనుషులను తినే విషయానికొస్తే భుజాలు వాటికి ప్రధానంగా ఆటంకమవుతాయని, మిగతా ఎముకల్లా కాకుండా అవి గట్టిగా బిగించడం వల్ల కూడా విరగవని నిపుణులు అంటున్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లా మళవల్లి అడవిలో కొండచిలువ ఒక జింకను మింగేసింది భారీ కొండచిలువ. భుక్తాయాసంతో కదలకుండా అక్కడే ఉండిపోయింది. స్థానిక యువకులు మొబైల్‌ ఫోన్లలో ఆ కొండచిలువను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..

హిందూ మహాసముద్రంలో భారీ ‘గ్రావిటీ హోల్’.. వీడిన మిస్టరీ!

తిండి పెట్టకుండా కొట్టి.. లైంగికంగా వేధించి..

భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో

Follow Us