Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Updated on: Nov 28, 2022 | 8:26 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేస్తుంది. అర్జెంటీనాలోని ఓ ఆసుపత్రిలో CCTV ఫుటేజ్‌లో రికార్డైన వీడియో..


చాలా మందికి దెయ్యం పేరు చెప్పగానే వణుకు పుడుతుంది. అసలు దెయ్యం ఉందా లేదా అనే వాదనను పక్కన పెడితే.. దెయ్యాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు దెయ్యంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోకియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో తెల్లవారుజామున 3 గంటలకు ఆస్పత్రిలోని సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియోలో ఆసుపత్రి ప్రవేశ ద్వారం ఆటోమేటిక్‌గా తెరుచుకోవడం కనిపిస్తుంది. శబ్దం విని, సెక్యూరిటీ గార్డు తన సీటులోంచి లేచి, డెస్క్‌లోని క్లిప్‌బోర్డ్‌ను తీసుకొని తలుపు వైపుకు వెళ్ళాడు. లైన్ డివైడర్ తీసేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత వీల్ చైర్‌లో కూర్చొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డు ప్రవర్తన చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. అంతకు ముందు రోజు ఒక రోగి ఆసుపత్రిలో మరణించాడు. ప్రస్తుతం అతడు దెయ్యం రూపంలో వచ్చినట్లు సమాచారం. కాగా నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. కొంతమంది వినియోగదారులు ఈ ఫుటేజీని చూసి నివ్వెరపోతే, మరికొందరు అది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే దీనిపై స్థానిక మీడియా ఆరా తీయగా… నవంబరు 17 రాత్రి నుంచి 18 ఉదయం 10 గంటల మధ్య ఆటోమేటిక్ గా 28 సార్లు తలుపులు తెరుచుకున్నాయని యాజమాన్యం తెలిపింది. క్లిప్‌బోర్డ్ పేపర్‌పై సెక్యూరిటీ గార్డు ఏదో రాస్తున్నట్లు వీడియోలో కనిపించగా.. రిజిస్టర్‌లో మాత్రం ఏం రాయలేదని తేలింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 28, 2022 08:26 AM
Loading...
Unable to load recommendations.
Follow Us