గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
జైపూర్‌లో పట్టపగలే గ్యాస్ సిలిండర్ దొంగతనం జరిగింది. సిలిండర్‌ను ఎత్తుకెళ్తున్న దొంగలు స్థానికులు వెంబడించగా, అతివేగంగా వెళ్తూ స్కూటర్ ప్రమాదానికి గురయ్యారు. ఒక దొంగను పట్టుకోగా, మరోకరు పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారాయి. దేశవ్యాప్త గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సామాన్యులనే కాదు.. దొంగలను కూడా ఆకర్షిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్యాస్ సిలిండర్ దొంగతనం చేయడానికి వచ్చిన ఓ కేటుగాడు, అతి తెలివి ప్రదర్శించి చివరకు జనం చేతికి చిక్కిన ఘటన సంచలనంగా మారింది. ఈ మొత్తం తతంగం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్‌లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్ నగర్ లో పట్టపగలే ఈ దొంగతనం జరిగింది. రోహిత్ అనే యువకుడు తన సహచరుడితో కలిసి స్కూటర్‌పై వచ్చాడు. ఒక ఇంటి ముందు స్కూటర్ ఆపి, లోపలికి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను భుజాన వేసుకుని బయటకు వచ్చాడు. ప్లాన్ ప్రకారం బయట తన స్నేహితుడు స్కూటర్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ నేరుగా సిలిండర్‌తో వచ్చి ఆ స్కూటర్‌పై కూర్చోగా వేగంగా వెళ్లిపోయారు. చోరీ చేసిన ఇంటిలోని వ్యక్తులు గట్టిగా కేకలు వేస్తూ నిందితుల కోసం పరుగెత్తారు. జనం వెంటాడుతున్నారన్న భయంతో దొంగలు స్కూటర్‌ను అతివేగంగా నడిపారు. అయితే, ఒక మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక స్కూటర్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో సిలిండర్ ఒకవైపు, దొంగలు మరోవైపు పడిపోయారు. కిందపడ్డ నిందితుడు రోహిత్ తేరుకుని పారిపోయేలోపే స్థానికులు చుట్టుముట్టి అతడిని పట్టుకున్నారు. అయితే, అతని సహచరుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బజాజ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాకు చెందినవాడని, ప్రస్తుతం జైపూర్‌లోని లాల్ కోఠి ప్రాంతంలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గతంలో కూడా వీరు ఇలాంటి చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం
ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ