కాలువ దాటేందుకు ప్రయత్నం !! కట్‌ చేస్తే.. సీన్‌ రివర్స్‌ !! వీడియో

|

Jan 21, 2022 | 9:18 AM

జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్‌లు తీసుకోకూడదని అంటారు. ఎందుకంటే.. అత్యాశకు పోతే అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని పెద్దలు చెబుతుంటారు.

జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్‌లు తీసుకోకూడదని అంటారు. ఎందుకంటే.. అత్యాశకు పోతే అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని పెద్దలు చెబుతుంటారు. తాజాగా ఈ సూక్తికి నిదర్శనమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షార్ట్ కట్‌ కోసం ట్రై చేస్తే.. ఫసక్ అయ్యింది. ఈ వీడియో చూసి.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఓ చిన్నపాటి కాలువ ఉంది. అందులో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే, కాలువకు అవతలి వైపు కారు, ఇవతలి వైపున కొందరు యువకులు ఉన్నారు. కారును చేరుకోవాలంటే కాలువ దాటాల్సి ఉంటుంది. మరి కాలువ దాటడం అంత ఈజీ ఏమీ కాదు. కూత వేటు దూరంలో కాలుపై బ్రిడ్జి మాదిరిగా దారి కూడా ఉంది.