ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
డేటింగ్ యాప్‌లో కలిసిన ఫ్రెంచ్ యువకుడు రొమెన్ షులెర్, తెలుగు అమ్మాయి అనిత అనూషలు యానాంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. 45 మంది ఫ్రెంచ్ బంధువులతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సప్త సముద్రాల అవతల పరిచయం.. డేటింగ్ యాప్‌లో మొదలైన స్నేహం.. చివరకు యానాం పుణ్యభూమిపై వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫ్రెంచ్ యువకుడు రొమెన్ షులెర్, తెలుగు అమ్మాయి మల్లిపూడి అనిత అనూషల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటను చూసి, “ప్రేమకు దూరం అడ్డుకాదు.. మనసు కలిస్తే చాలు” అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యానాంకు చెందిన భారతీయ ఫ్రెంచ్ పౌరులు మల్లిపూడి వెంకటేశ్వరరావు కుమార్తె అనిత అనూష పారిస్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే స్టేజ్ ఆర్టిస్ట్ అయిన రొమెన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భారతీయ సంస్కృతి, ఇక్కడి వివాహ వ్యవస్థపై మక్కువ పెంచుకున్న రొమెన్, తన వివాహం హిందూ సంప్రదాయంలోనే జరగాలని పట్టుబట్టారు. ఇంకేముంది…ఈ పెళ్లి కోసం వరుడి తల్లిదండ్రులతో పాటు సుమారు 45 మంది ఫ్రెంచ్ దేశీయులు యానాం తరలివచ్చారు. ఘనంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో భారతీయ పాటలకు ఫ్రాన్స్ అతిథులు చిందులేస్తూ సందడి చేశారు. వధూవరులను ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై యానాం పురవీధుల్లో ఊరేగించడం స్థానికులను విశేషంగా ఆకర్షించింది. యానాం రిసార్ట్‌లో వేదమంత్రాలు, బాజాభజంత్రీల నడుమ అనిత మెడలో రొమెన్ మూడు ముళ్లు వేశారు. భారతీయ సంస్కృతి, ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు అంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్నానని వరుడు రొమెన్ ఆనందం వ్యక్తం చేశారు. విదేశీయులు సైతం మన తెలుగు సంప్రదాయానికి ఫిదా అవ్వడం చూస్తుంటే, మన సంస్కృతి గొప్పతనం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్
తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!
KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్’ కు.. అనుకూలంగా తీర్పు
Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో
Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే
