Shortest Doctor: 3 అడుగుల డాక్టర్ విజయగాథ.! అప్పుడు ప్రభుత్వం తిరస్కరణ- ఇప్పుడు వరల్డ్​ రికార్డు

|

Mar 12, 2024 | 5:23 PM

తనకు ఉన్న శారీరక వైకల్యాన్ని అధిగమించి మరి ఓ యువకుడు డాక్టర్​ అయ్యారు. వయస్సు 23 సంవత్సరాలు ఎత్తు 3 అడుగులు మాత్రమే. ఆ ఎత్తు కారణంగా మెడికల్‌ కాలేజ్‌లో సీటు ఇవ్వలేదు గుజరాత్‌ ప్రభుత్వం. అయినా సరే కోర్టుకు వెళ్లి మరీ అర్హత సాధించి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. గుజరాత్‌లోని భావ్​నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు.

తనకు ఉన్న శారీరక వైకల్యాన్ని అధిగమించి మరి ఓ యువకుడు డాక్టర్​ అయ్యారు. వయస్సు 23 సంవత్సరాలు ఎత్తు 3 అడుగులు మాత్రమే. ఆ ఎత్తు కారణంగా మెడికల్‌ కాలేజ్‌లో సీటు ఇవ్వలేదు గుజరాత్‌ ప్రభుత్వం. అయినా సరే కోర్టుకు వెళ్లి మరీ అర్హత సాధించి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. గుజరాత్‌లోని భావ్​నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు. గణేశ్‌కు 8మంది తోబుట్టువులు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి ఇలా లేదు. మిగతా వారితో పోల్చితే తాను తక్కువ ఎత్తు ఉన్నానని గణేశ్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టారు. 10వ తరగతి పూర్తి చేశారు. గణేశ్​ తోబుట్టువులు 10వ తరగతి వరకే చదువుకున్నారు. వాళ్ల కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తిగా గణేశ్ నిలిచారు. ఆ తర్వాత ఇంటర్​ పూర్తి చేశారు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్​లో 233 మార్కులు సాధించారు. కానీ తన వైకల్యం కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది.

గణేశ్​ అంతటితో నిరాశ కుంగిపోకుండా తన కాలేజీ ప్రిన్సిపల్ దల్పత్ కటారియా సాయంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కటారియా గణేశ్​కు అందించారు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేశ్​కు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో భావ్​నగర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు గణేశ్. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌లో​ భాగంగా భావ్ ​నగర్​ వైద్య కళాశాలలో వైద్యం చేస్తున్నారు. అయితే గణేశ్ డెర్మటాలజిస్ట్‌​ కావాలని అనుకుంటున్నారు. ​ ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్​ టైటిల్‌​కు అర్హత సాధించాడని మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..