ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. గదిలోనే సమాధి

|

Jan 12, 2024 | 9:39 PM

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇది మంగళవారం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు సోమవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. అయితే, సోమవారం రాత్రి మూసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రం అయినా తెరుచుకోలేదు.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇది మంగళవారం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు సోమవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. అయితే, సోమవారం రాత్రి మూసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రం అయినా తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అందులో ఐదుగురు చిన్నారులు విగతజీవులై కనిపించారు. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ఇద్దర్నీ వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని రహీజుద్దీన్‌గా గుర్తించినట్లు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అనుపమ్‌ సింగ్ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు