కూతురి కోసం ఈ తండ్రి పెద్ద యుద్ధమే చేశాడుగా..

Updated on: Sep 27, 2022 | 8:55 PM

ఇటీలవల ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువైపోయింది. పల్లె, పట్నం తేడా లేదు.. ఎక్కడ చూసిన విచ్చలవిడిగా సంచరిస్తున్న కోతులు ముప్పేట దాడి చేస్తున్నాయి.

ఇటీలవల ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువైపోయింది. పల్లె, పట్నం తేడా లేదు.. ఎక్కడ చూసిన విచ్చలవిడిగా సంచరిస్తున్న కోతులు ముప్పేట దాడి చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా దండెత్తివస్తున్న వానరాలు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడుల్లో గాయపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కి చెందినదిగా తెలిసింది. ఈ వీడియో ఒక జర్నలిస్టు ఇంటి బయటిది. ఈ వీడియోలో మీరు ఒక చిన్న సందులో చాలా ఇళ్లు ఉన్నాయి.. కొంత నిర్మాణ సామాగ్రి కూడా కనిపిస్తుంది. సదరు జర్నలిస్టు కూతురిపై కోతులు దాడికి దిగాయి. కూతురి అరుపులు విని అతడు బయటకు వచ్చాడు. కూతురిని కాపాడి ఇంట్లోకి పంపించాడు. ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్‌ అవుతారు. ఈ కోతులను తరిమికొట్టాలని సుమారు అరగంట పాటు వాటితో పెద్ద యుద్ధమే చేశాడు. కానీ, కోతులు చాలా తెలివైనంటారు కదా.. అవి తమ తెలివిని ప్రయోగించాయి. అతడు రాళ్ల కోసం కిందకు వంగిన వెంటనే ఓ కోతి అతనిపైకి దూకింది. దాంతో అతడు ఒక్కసారిగా బోర్లపడిపోయాడు. అతడికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..

Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..

సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి

అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం

Digital TOP 9 NEWS: పదం పలకలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్! || రెండు విమానాల క్రాష్

 

 

Published on: Sep 27, 2022 08:55 PM
Loading...
Unable to load recommendations.
Follow Us