దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి
కిడ్నీ మార్పిడి, కీలుమార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం. కానీ, హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులకు ఏకంగా చేయి మార్పడి ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ఇలాంటి ఆపరేషన్ దేశంలో ఇదే మొదటిది. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న 65 ఏళ్ల గౌతం తయాల్ అనే వ్యక్తి తాజాగా చేయి మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ఆ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా, దేశంలోని మొదటి వ్యక్తిగా రికార్డులకెక్కారు.
కిడ్నీ మార్పిడి, కీలుమార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం. కానీ, హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులకు ఏకంగా చేయి మార్పడి ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ఇలాంటి ఆపరేషన్ దేశంలో ఇదే మొదటిది. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న 65 ఏళ్ల గౌతం తయాల్ అనే వ్యక్తి తాజాగా చేయి మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ఆ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా, దేశంలోని మొదటి వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇలాగే చేయి మార్పిడి చేయించుకున్న మరో కుర్రాడి వయసు 19 ఏళ్లు. ఈ రెండు క్లిష్టతరమైన ఆపరేషన్లు డిసెంబరు చివరి వారంలో జరిగాయి. దాదాపు 17 గంటలపాటు జరిగిన ఆపరేషన్లు విజయవంతమైనట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీకి చెందిన గౌతం తయాల్‌కు దశాబ్దం క్రితం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. రెండేళ్ల క్రిత ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మణికట్టుపై నుంచి చేయిని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా, బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని గౌతమ్‌కు అమర్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఖుష్బూ.. ఎందుకంటే ??
Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు
కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో
Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార
శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!