పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..

Updated on: Sep 06, 2026 | 11:17 AM

పగటిపూట ఆర్‌ఎంపీ డాక్టర్‌గా వైద్యం చేస్తూ, రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బయటపడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి పరిధిలో ఆరు దొంగతనాలకు పాల్పడిన మడగల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.13 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

పగటిపూట తెల్లకోటు వేసుకొని వైద్యం చేస్తాడు. రాత్రయితే మాత్రం ఇతగాడి కథే వేరుగా ఉంటుంది. డాక్టర్ ముసుగులో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి బాగోతం బట్టబయలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన మడగల శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వైద్యుడిగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గ్రామంలో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇదే అదునుగా భావించి, పగటిపూట వైద్యం చేస్తూ.. రాత్రివేళల్లో ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా ఆరు దొంగతానాలకు పాల్పడి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితుడి గుట్టు రట్టు చేశారు. రాజవొమ్మంగి డి.ఎస్.పి. అష్రఫ్ ఆలీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడి నుంచి దాదాపు రూ.13 లక్షల విలువైన 82 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులు, రూ.50 వేల నగదుతో పాటు చోరీ చేసిన రెండు కోళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ముసుగులో నిందితుడు సాగించిన ఈ అరాచకాలపై ఆరు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Loading...
Unable to load recommendations.
Follow Us