ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్‌ రాయించుకున్న మహిళ !!

|

Jan 10, 2024 | 9:18 PM

ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్‌ ఫోన్లో తలదూర్చి బిజీగా గడిపేస్తునారు. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోని సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది ముంబయిలోని ఓ మహిళ. అవసరాలకు మించి ఫోన్‌ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించింది మంజుగుప్తా. దాంతో కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్‌ రాయించుకుంది.

ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్‌ ఫోన్లో తలదూర్చి బిజీగా గడిపేస్తునారు. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోని సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది ముంబయిలోని ఓ మహిళ. అవసరాలకు మించి ఫోన్‌ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించింది మంజుగుప్తా. దాంతో కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్‌ రాయించుకుంది. ఇంట్లో ఫోన్‌ అధిక వాడకంపై షరతులు విధించింది. ఈ మేరకు 50 రూపాయల బాండ్‌పేపర్‌పై కొన్ని షరతులు టైప్‌ చేయించి వారితో సంతకాలు చేయించింది. ఈ బాండ్‌ పేపర్‌ను మంజుగుప్తా మేనకోడలు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. అందరూ నిద్ర లేవగానే మొబైల్‌ చూడకుండా నేరుగా బయట సూర్యుడిని దర్శించాలి. అందరూ కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద భోజనం చేయాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు

నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??