ఐదు రోజుల్లో ఎవరెస్ట్‌ ఎక్కేసారు! యమా స్పీడ్‌గా ఎలా అంటే ..

Updated on: May 24, 2025 | 3:04 PM

బ్రిటన్‌కు చెందిన నలుగురు పర్వతారోహకుల బృందం సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని ఎలాంటి ముందస్తు సన్నద్ధతా లేకుండా ఐదంటే ఐదు రోజుల్లోపే అధిరోహించి ఆశ్చర్యపరిచింది. 8,849 మీటర్ల ఎత్తులో ఉండే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలంటే నేపాల్‌లోని బేస్‌ క్యాంప్‌ వద్ద కనీసం కొద్ది నెలల పాటు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవడం తప్పనిసరి.

బ్రిటిష్‌ బృందం మాత్రం అలాంటిదేమీ లేకుండానే పని కానిచ్చేసింది. మే 16న లండన్‌ నుంచి బయల్దేరి కాట్మండు చేరింది. అదే రోజు మధ్యాహ్నం ఎవరెస్టు బేస్‌ క్యాంపు చేరుకుని నేరుగా అధిరోహణ మొదలు పెట్టేసింది. బుధవారం ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రం చేరింది. ఈ మొత్తానికీ పట్టింది కేవలం 4 రోజుల 18 గంటలు మాత్రమే. ఈ బృందంలోని నలుగురూ స్పెషల్‌ ఫోర్సెస్‌లో సైనికులుగా పని చేసి రిటైరైనవాళ్లే కావడం విశేషం. పైగా వారిలో ఒకరు మాజీ మంత్రి కూడా. వారంతా మూడు నెలలపాటు బ్రిటన్‌లోనే పక్కా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు. అందుకోసం ఎవరెస్టు ఆరోహణ క్రమంలో ఎదరయ్యే పరిస్థితులన్నింటినీ లండన్‌లోనే కృత్రిమంగా సృష్టించుకున్నారు. హైపోక్సియా టెంట్లు, జెనాన్‌ వాయువు, ఇతర సాంకేతికతను ఉపయోగించుకున్నారు. సాధారణంగా పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణం పలుచబడుతూ వస్తుంది. దాంతోపాటే ఆక్సిజన్‌ కూడా తగ్గిపోతుంటుంది. 8 కి.మీ. ఎగువన భూ ఉపరితలంతో పోలిస్తే కేవలం మూడో వంతు ఆక్సిజనే అందుబాటులో ఉంటుంది. దాంతో శ్వాసించడం కష్టతరంగా మారుతుంది. అది ఎన్నో ఇతర సమస్యలకూ దారితీస్తుంది. బ్రిటిష్‌ బృందం సభ్యులు తమ సన్నద్ధతలో భాగంగా లండన్‌లో ఆరు వారాల పాటు హైపోక్సియా టెంట్లలో నిద్రించారు. అనంతరం జర్మనీలో ఓ క్లినిక్‌లో రెండు వారాల పాటు జెనాన్‌ వాయువును పీలుస్తూ వచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓరీ దేవుడో..! ఇంటి పైకప్పుతో పాటు ఎగిరిపోయిన చిన్నారులు

హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్

తెలుగులో ఛాన్సులు రావడంలేదుంటూ.. స్టేజ్‌పై ఏడ్చిన హీరోయిన్

మా హీరో,హీరోయిన్లకు సపరేట్‌ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్